తణుకు నియోజకవర్గ గౌడ సంఘ కన్వీనర్‌గా వెంకట్
ABN , First Publish Date - 2020-12-10T06:25:09+05:30 IST
తణుకు నియోజకవర్గ గౌడ సంఘం కన్వీనర్‌గా మట్టా వెంకట్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

తణుకు రూరల్, డిసెంబరు 9 : తణుకు నియోజకవర్గ గౌడ సంఘం కన్వీనర్‌గా మట్టా వెంకట్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తణుకు పాతూరులోని గౌడ సంఘం నాయకులు నార్గాని సత్యనారాయణ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి గౌడ సంఘ సమావేశంలో గౌరవాధ్యక్షుడు వెలగన త్రి మూర్తులు, టౌన్ కన్వీనర్‌గా నార్గాని సత్యనారాయణ, తణుకు మండలం తేతలి గ్రామానికి చెందిన వైసీపీ యూత్ అధ్యక్షుడు మట్టా వెంకట్‌ను నియోజకవర్గ కన్వీనర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరిని పలువురు గౌడ సంఘ పెద్దలు అభినందించారు.