గోష్పాదేశ్వరస్వామికి అన్నాభిషేకం

ABN , First Publish Date - 2020-12-31T04:51:19+05:30 IST

కొవ్వూరు సంస్కృత పాఠశాల ప్రాంగణంలో వున్న లలిత పార్వతీ సమేత గోష్పాదేశ్వర స్వా మి ఆలయంలో స్వామికి అన్నాభిషేకం నిర్వహించా రు.

గోష్పాదేశ్వరస్వామికి అన్నాభిషేకం
గోష్పాదేశ్వరస్వామికి అన్నాభిషేకం నిర్వహిస్తున్న పండితులు

కొవ్వూరు డిసెంబరు 30 : కొవ్వూరు సంస్కృత పాఠశాల ప్రాంగణంలో వున్న లలిత పార్వతీ సమేత గోష్పాదేశ్వర స్వా మి ఆలయంలో స్వామికి అన్నాభిషేకం నిర్వహించా రు. ఆలయ అర్చకుడు మానేపల్లి సుబ్రహ్మణ్య శాస్త్రి ఆధ్వర్యంలో మార్గశీర్ష పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి గణపతి పూజ, శివునికి మహన్యాసం, రుద్రాభిషేకం జరిగింది. అనంతరం గోష్పాద స్వామికి భక్తుల సహకారంతో 108 కేజీలు బియ్యం వండి చల్లార్చి అన్నాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో వల్ల కాలసర్ప దోషం, నర దృష్టి, నరఘోష నశిస్తాయని శాస్త్రం చెబుతుందన్నారు. 

Updated Date - 2020-12-31T04:51:19+05:30 IST