గోదావరి ఉధృతి పెరుగుతోంది : సబ్ కలెక్టర్
ABN , First Publish Date - 2020-08-22T11:34:18+05:30 IST
గోదావరి ప్రవాహం మళ్లీ పెరిగే అవకాశం ఉందని, లంకవాసులు అప్రమత్తంగా వుండాలని నరసాపురం సబ్ కలెక్టర్ విశ్వనాథన్ అన్నారు
ఆచంట, ఆగస్టు 21: గోదావరి ప్రవాహం మళ్లీ పెరిగే అవకాశం ఉందని, లంకవాసులు అప్రమత్తంగా వుండాలని నరసాపురం సబ్ కలెక్టర్ విశ్వనాథన్ అన్నారు. అయోధ్యలంక, పుచల్లంక గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. గోదావరి ప్రస్తుతం నిలకడగా ఉన్నప్పటికీ పెరిగే అవకాశం ఉన్నందున్న అధికారులు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. తహసీల్దార్ కృష్ణారావు, ఎంపీడీవో ఎన్.శ్రీనివాసరావు, ఎస్‌ఐ సీహెచ్.రాజశేఖర్ తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యే నిమ్మల పర్యటన
యలమంచిలి/పోడూరు: కాంబొట్లపాలెం ముంపు ప్రాం తాల్లో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు శుక్రవారం పర్య టించారు. గ్రామంలో వైద్య శిబిరాన్ని పరిశీలించి, గ్రామస్తు లతో మాట్లాడారు. నక్కల డ్రెయినేజీవల్ల ఈప్రాంతంలో ఏటా పంట నష్టం జరుగుతోందని, శాశ్వత నివారణకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలని కోరారు. నక్కల డ్రె యిన్ ఉధృతితో మునిగిన పోడూరు మండలం వద్దిపర్రులో ఎమ్మెల్యే నిమ్మల పర్యటించారు. ముంపులో వరి నాట్లు ఆయన పరిశీలించారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే దాళ్వా పంట సొమ్ములు కూడా రైతులకు తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
యలమంచిలి: గోదావరి ముంపు ప్రాంతాలలో నరసాపు రం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, డీసీసీబీ చైర్మన్ కవురు శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ యడ్ల తాతాజీ, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పర్యటించారు.
మత్స్యకారులను ఆదుకోవాలి
నరసాపురం: వరదతో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు డిమాండ్ చేశారు. పొన్నపల్లిలో నీట మునిగిన వార్డుల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. ఐదు రోజులుగా వరద నీటిలో ఉంటున్నా తమను ఎవరూ పట్టించుకోలేదని మహిళలు ఆయన దృష్టికి తెచ్చారు. అనంతరం బుడితల రేవు వద్ద మత్స్యకారులను కలిశారు. వరద వల్ల వారం రోజుల నుంచి వేట లేదన్నారు. ఆయన వెంట కొప్పాడ రవి, రాయుడు శ్రీరాములు ఉన్నారు.