‘గోదావరిలో ఎక్కడైనా చేపల వేట చేసుకోవచ్చు’

ABN , First Publish Date - 2020-11-26T05:14:39+05:30 IST

లైసెన్స్‌ పొందిన మత్య్సకారులు రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి నదిలో ఎక్కడైనా చేపలు వేట చేసుకోవచ్చని మత్య్సశాఖ సహాయ సంచాలకుడు బి.సైదానాయక్‌ అన్నారు.

‘గోదావరిలో ఎక్కడైనా చేపల వేట చేసుకోవచ్చు’

కొవ్వూరు నవంబరు 25 : లైసెన్స్‌ పొందిన మత్య్సకారులు రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి నదిలో ఎక్కడైనా చేపలు వేట చేసుకోవచ్చని మత్య్సశాఖ సహాయ సంచాలకుడు బి.సైదానాయక్‌ అన్నారు. వాడపల్లి బంగారంపేట గ్రామంలో మంగళవారం రాత్రి పల్లెనిద్ర చేశారు. ఈ సందర్భంగా మత్య్సకారుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విజ్జేశ్వరం వద్ద నదిలో చేపలు వేటకు ఆ గ్రామ మత్య్సకారులు అడ్డుపడుతున్నారని తెలిపారు. దీనిపై ఆయన స్పంది స్తూ లైసెన్స్‌ పొందిన మత్య్సకారుల వేటను ఎవరూ అడ్డుకోకూడదన్నారు. లైసెన్స్‌ కోసం కార్యాలయం చుట్టూ తిరగకుండా ఇన్స్‌స్పెక్టర్‌లు అయా గ్రాయాలలో పర్యటించి సకాలంలో లైసెన్స్‌లు రెన్యూవల్‌ చేయాలని అదేశించారు. గత ఏడాది 84 మందికి అక్కడికక్కడే లైసెన్స్‌లు రెన్యువల్‌ చేసి అందించారు. కార్యక్రమంలో మాజీ సర్నంచ్‌ కాకర్ల నారాయుడు, మత్య్సశాఖ సహాయకుడు చక్రవర్తి, మత్య్సకారులు పాల్గొన్నారు.

Read more