వీఆర్వోల పదోన్నతిని అడ్డుకుంటున్న జీవో

ABN , First Publish Date - 2020-05-10T09:02:38+05:30 IST

వీఆర్వోలు పదోన్నతికి ఎదురు చూస్తున్న సమయంలో ప్రభుత్వం జీవో 132 విడుదల చేసి అడ్డుకోవడం దారుణమని..

వీఆర్వోల పదోన్నతిని అడ్డుకుంటున్న జీవో

పెనుమంట్ర, మే 9 : వీఆర్వోలు పదోన్నతికి ఎదురు చూస్తున్న సమయంలో ప్రభుత్వం జీవో 132 విడుదల చేసి అడ్డుకోవడం దారుణమని వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు అన్నారు. ఈ మేరకు శనివారం విలేకరులతో మాట్లాడారు.ప్రభుత్వం జీవో రద్దు చేసి గతంలో మాదిరిగా 60:40 నిష్పత్తిలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రకారం సీనియర్‌ సహాయకులుగా పదోన్నతి కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించి వీఆర్వోల సమస్యలను పరిష్కరించాలని ప్రధాన కార్యదర్శి రాంబాబు, రాష్ట్ర నాయకుడు మిరియాల లక్ష్మినారాయణ కోరారు. లేకపోతే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

Updated Date - 2020-05-10T09:02:38+05:30 IST