ఇంటింటికీ వెళ్లి..ఆరోగ్య పరీక్ష చేయాల్సిందే

ABN , First Publish Date - 2020-04-08T11:37:36+05:30 IST

గుర్తించిన ప్రాంతాల్లో ప్రతీ ఒక్కరి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాల్సిందిగా ప్రభు త్వ వైద్యులను కలెక్టర్‌

ఇంటింటికీ వెళ్లి..ఆరోగ్య పరీక్ష చేయాల్సిందే

కలెక్టర్‌ ముత్యాలరాజు


ఏలూరు ఏప్రిల్‌ 7, (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): గుర్తించిన ప్రాంతాల్లో ప్రతీ ఒక్కరి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాల్సిందిగా ప్రభు త్వ వైద్యులను కలెక్టర్‌ ముత్యాలరాజు ఆదేశించారు. అధికారులు తీసుకుం టున్న చర్యలపై మంగళవారం ఆయ న సమీక్ష నిర్వహించారు. ప్రతీ ఒక్కరి ఆరోగ్య పరిస్ధితిని ఎప్పటికిప్పు డు పర్యవేక్షించాలన్నారు. ఒకవేళ అనుమానం ఉంటే వారిని తక్షణం దగ్గరలోని క్వారంటైన్‌లో చేర్చాలని సూచించారు. ప్రతీ ఒక్కరి వివరాలు సక్రమంగా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టీమ్‌ సభ్యులందరూ విధిగా హాజరు కావాలని చెప్పారు. రక్త నమూనాలను సేకరించేందుకు నియమించిన 15 టీమ్‌లు ప్రతీరోజూ ఖచ్చితంగా శాంపిల్స్‌ సేకరణలో ముందుండాలన్నారు.


క్వారంటైన్‌లో ప్రతీ ఒక్కరికి వసతులు కల్పించాలని, క్వారంటైన్‌ సెంటర్‌ వద్ద 24 గంటలూ సెక్యూరిటీ, మెడికల్‌ టీమ్‌ ఉండేలా జాగ్రత్త పడాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ప్రతీ క్వారంటైన్‌లో నాలుగు రూమ్‌లు ఏర్పాటుచేసి, కార్యాలయానికి ఒకటి, నర్సులకొకటి, డాక్టర్లకు ఒకటి, పరీక్షలకు మరొకటి కేటాయించాలన్నారు. ఎప్పటికప్పుడు క్వారం టైన్‌ కేంద్రాన్ని సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణంతో శుభ్రం చేయాలని, శానిటరీ వర్కర్లకు మాస్కులు, గ్లౌజులు అందించాలని ఆదేశించారు.


సమావేశంలో ప్రత్యేకాధి కారి ప్రవీణ్‌కుమార్‌, జేసి వెంకటరమణారెడ్డి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హిమాన్సు కౌషిక్‌, జేసి-2 నంబూరి తేజ్‌భరత్‌, వీఆర్‌వో శ్రీనివాసమూర్తి, జిల్లా వైద్యాధికారి సుబ్రహ్మణ్యేశ్వరి, జడ్పీ సీఈవో శ్రీనివాసులు, హౌసింగ్‌ పీడీ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-04-08T11:37:36+05:30 IST