రైల్వే ఐరన్‌ చక్రాల కింద గంజాయి రవాణా

ABN , First Publish Date - 2020-11-22T05:10:39+05:30 IST

రైల్వే ఐరన్‌ చక్రాల తరలింపు ముసుగులో గంజాయి రవాణా చేస్తున్న లారీని పోలీసులు పట్టు కున్నారు.

రైల్వే ఐరన్‌ చక్రాల కింద గంజాయి రవాణా
గంజాయి నిందితులను అరెస్టు చేసి వివరాలు వెల్లడిస్తున్నసీఐ శ్రీనివాసరావు

100 కేజీల గంజాయి స్వాధీనం – ఇద్దరి అరెస్టు

పెదపాడు, నవంబరు 21 : రైల్వే ఐరన్‌ చక్రాల తరలింపు ముసుగులో గంజాయి రవాణా చేస్తున్న లారీని పోలీసులు పట్టు కున్నారు. ఏపీ03 టీసీ 9477 నెంబరు గల లారీలో గంజాయి రవాణా జరుగుతున్నట్టు పోలీసులకు వచ్చిన సమాచారంతో పెదపాడు మండలం కలపర్రు టోల్‌గేట్‌ వద్ద శుక్రవారం తనిఖీలు చేశారు. రైల్వేకి చెందిన ఐరన్‌ చక్రాలు రవాణా చేస్తున్న లారీలోనే గంజాయిని  కూడా బీహార్‌ నుంచి బెంగళూరుకు రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. ఈ మేరకు  చిత్తూరుకు చెందిన మహ్మద్‌ రఫ్‌, పి.అప్రాస్‌ అరెస్ట్‌ చేసి చక్రాల కింద ఉన్న రూ.3 లక్షల విలువైన 100 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ జ్యోతిబస్‌ శనివారం తెలిపారు. గంజా యిని,లారీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశా మన్నారు. నిం దితులను కోర్టుకు తరలించగా రిమాండ్‌ విధించారు. తనిఖీల్లో పెదపాడు స్టేషన్‌ సిబ్బంది సువర్ణరాజు,హమీద్‌, ప్రదీప్‌, వెంకటేశ్వ రరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-22T05:10:39+05:30 IST