కరోనా పాజిటివ్‌తో నలుగురి మృతి
ABN , First Publish Date - 2020-08-01T21:33:38+05:30 IST
పెనుగొండలో కరోనాతో ఒక మహిళ(58) శుక్రవారం ఉదయం మృతి చెందింది. గత మూడు నెలల నుంచి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో శుక్రవారం పరిస్థితి విషమిం చింది. ఈమె మృత దేహానికి కరోనా

పెనుగొండ/పోడూరు/పెదపాడు(ఆంధ్రజ్యోతి): పెనుగొండలో కరోనాతో ఒక మహిళ(58) శుక్రవారం ఉదయం మృతి చెందింది. గత మూడు నెలల నుంచి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో శుక్రవారం పరిస్థితి విషమిం చింది. ఈమె మృత దేహానికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలినట్టు అధికారులు తెలిపారు. పోడూరు మండలం వేడంగిపాలెంలో కరోనాతో ఒకరు(59) మృతి చెందినట్టు పోడూరు పీహెచ్‌సీ వైద్యురాలు ఎస్.కీర్తికిరణ్ తెలిపారు. ఈ నెల 22న పాలకొల్లు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయనకు పరీక్ష నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. 23న వైద్యం నిమిత్తం ఏలూరు ఆశ్రం కొవిడ్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమిం చడంతో వైద్యం పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందినట్టు వైద్యురాలు తెలిపారు. జిన్నూరు, మట్టపర్రు, వేడంగి, కవిటం, పోడూరు గ్రామాల్లో 31 మందికి కరోనా పరీక్షలు నిర్వహించి నమూనా లను భీమవరం పరీక్షా కేంద్రాలకు పంపినట్టు పోడూరు పీహెచ్‌సీ వైద్యు రాలు ఎస్.కీర్తికిరణ్ తెలిపారు. పెదపాడు మండలంలోని కొత్తూరుకు చెందిన వ్యక్తి కరోనా బారిన పడి విజయవాడలో చికిత్స పొందుతూ శుక్ర వారం మృతి చెందాడు. వసంతవాడకు చెందిన 52 సంవత్సరాల వ్యక్తి ఏలూరులో చికిత్స పొందుతూ మృతి చెందాడు.