-
-
Home » Andhra Pradesh » West Godavari » forest Officers
-
కోలుకున్న కొండచిలువ
ABN , First Publish Date - 2020-11-22T04:57:48+05:30 IST
చేపల వలలో చిక్కు కుని గాయపడిన భారీ కొండ చిలువకు జంగారెడ్డిగూడెం పశువైద్యశాలలో శస్త్రచికిత్స అనంతరం శనివారం అటవీ శాఖ అధికారులు అడవిలో సురక్షితంగా వదిలిపెట్టారు.

అడవిలో సురక్షితంగా వదిలిన అటవీ శాఖ అధికారులు
జంగారెడ్డిగూడెం, నవంబ రు 21 : చేపల వలలో చిక్కు కుని గాయపడిన భారీ కొండ చిలువకు జంగారెడ్డిగూడెం పశువైద్యశాలలో శస్త్రచికిత్స అనంతరం శనివారం అటవీ శాఖ అధికారులు అడవిలో సురక్షితంగా వదిలిపెట్టారు. జీలుగుమిల్లిలోని ఒక చెరువు లో ఉన్న చేపల వలలో ఈనె ల 9న కొండ చిలువ చిక్కుకుని తీవ్రంగా గాయపడింది. స్థానికుల సమాచా రంతో స్నేక్ సేవి యర్ సొసైటీ ప్రతినిధి చదలవాడ క్రాంతి పామును పట్టుకుని పశువైద్యుడు శ్రీనివాసన్‌తో శస్త్ర చికిత్స చేయించారు. కొండచిలువ పూర్తిగా కోలుకోవడంతో ఫారెస్టు అధికారి శ్రీవాణికి సమాచారం ఇవ్వడంతో మర్లగూడెం ఫారెస్టులో పామును సురక్షితంగా విడిచిపెట్టారు.