ఆకివీడు ఆంధ్రాబ్యాంక్‌లో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2020-12-08T04:02:49+05:30 IST

ఆకివీడు ఎస్‌.టర్నింగ్‌కు సమీపంలో జాతీయరహదారికి అనుకుని ఉన్న ఆంధ్రాబ్యాంకులో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా సోమవారం ఉదయం 8.30 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది.

ఆకివీడు ఆంధ్రాబ్యాంక్‌లో అగ్నిప్రమాదం
లోపల దగ్ధమైన ఆంధ్రాబ్యాంకు

 విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణం

 రూ. 50 లక్షల ఆస్తినష్టం

ఆకివీడు, డిసెంబరు 7 : ఆకివీడు ఎస్‌.టర్నింగ్‌కు సమీపంలో జాతీయరహదారికి అనుకుని ఉన్న ఆంధ్రాబ్యాంకులో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా సోమవారం ఉదయం 8.30 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. ఏసీలు,ఫర్నిచర్‌, రికార్డ్స్‌ దగ్ధమై ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. తలుపులు వేచి ఉండడంతో బ్యాంకు మొత్తం పొగతో కమ్ముకుపోయింది.మంటల వేడికి బ్యాంకు షట్టర్‌ కరిగి బిగుసుకుపోయింది.ఈ మేరకు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించ డంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కిటికీ అద్దాల నుంచి ముందుగా తడిపారు.ఆ తరువాత షట్టర్‌ బద్దలుకొట్టి లోపలికి వెళ్లి స్ట్రాంగ్‌రూమ్‌కు ఎటువంటి ప్రమాదం జరగకుండా మంటలు అదుపుచేశారు. అయితే ఒక సమ యంలో ఆకివీడు ఫైర్‌ వాహనంలో నీరు అయిపోవడంతో కైకలూరు నుంచి మరొక వాహనం రప్పించి మంటలను అదుపుచేశారు. సుమారు రూ.50 లక్షల ఆస్తినష్టం జరిగినట్టు బ్యాంకు మేనేజర్‌ మహేంద్రన్‌జీ తెలిపారు.ఖాతాదారులు ఎటువంటి ఆందో ళన చెందనవసరంలేదన్నారు. రికార్డులన్నీ బెంగుళూర్‌ హెడ్‌ ఆఫీసులో భద్రంగా ఉంటాయన్నారు. మరమ్మతులు చేయించడానికి సుమారు పది రోజులు సమయం పడుతున్నందన్నారు. ఖాతాదారులకు మంగళవారం నుంచి కార్పొరేషన్‌ బ్యాంకులో సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ ఘటనలో పలువురు అగ్నిమాపక సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. భీమవరం డివిజన్‌ ఏజీఎం బి.కల్పన, సీనియర్‌ మేనేజర్‌ శివాజీ వచ్చి పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బంది ఎల్‌ ఎఫ్‌ఆర్‌.సతీష్‌కుమార్‌,ఎఫ్‌ఎం వి.వెంకటేష్‌, ఎం.రామకోటేశ్వరరావు, ఎ.రియాన్‌, జీవీ శ్రీనివాసరావు, డీవోపీ జి.రమేష్‌లను అభినందించారు.


Updated Date - 2020-12-08T04:02:49+05:30 IST