రోజూ ఒక గంట రోగుల కష్టాలు తెలుసుకోండి

ABN , First Publish Date - 2020-02-08T12:10:00+05:30 IST

కమిటీ సభ్యులు రోజుకు ఒక గంట పాటు అయినా ఆసుపత్రిలో పరిశీ లించి రోగుల కష్టసుఖాలు తెలుసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, వైద్య

రోజూ ఒక గంట రోగుల కష్టాలు తెలుసుకోండి

ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులకు సూచన

విధుల పట్ల అలసత్వం వహిస్తే సహించను

రెండు నెలల్లో  సమస్యలన్నీ పరిష్కరిస్తా

అభివృద్ధి కమిటీ సమావేశంలో మంత్రి నాని

ఏలూరుక్రైం, ఫిబ్రవరి 7 : కమిటీ సభ్యులు రోజుకు ఒక గంట పాటు అయినా ఆసుపత్రిలో పరిశీ లించి రోగుల కష్టసుఖాలు తెలుసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని సూచించారు.ఆసుపత్రి అభివృద్ధి కమిటి మొదటి సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఎక్కడైనా ఏవైనా లోపాలు ఉంటే ప్రతి నెలా జరిగే ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో చర్చించి సత్వర చర్యలు చేపట్టాలన్నారు. అవినీతి లేకుండా రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలన్నారు. ఎవరైనా విధి నిర్వ హణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చ రించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రికి రెండు నెలల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.  ఆసు పత్రిలో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు  చేపడతామన్నారు. ముఖ్యంగా బ్లడ్‌ బ్యాంక్‌కు రూ.35 లక్షల విలువైన అత్యాధునిక యంత్ర పరికరాలు వస్తే మూలన పడవేశారన్నారు.

వాటి విని యోగానికి రూ.25 లక్షలతో ఒక భవనాన్ని  నిర్మిస్తామ న్నారు.ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులకు జిల్లా కలెక్టర్‌ త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేస్తారని చెప్పారు.ఇటీవల ఆసుపత్రి మార్చురీలో ఒక మృత దేహం కళ్ళను ఎలుకలు తినివేసిన సంఘటన దుర దృష్టకరమని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా  చర్యలు చేపట్టామన్నారు.ఆసుపత్రిలో వాహ నాల పార్కింగ్‌ అస్తవ్యస్తంగా ఉందని పార్కింగ్‌ స్థలాన్ని సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. రోగులకు అందించే ఆహారం నాణ్యతగా ఉండాలని తెలిపారు.రానున్న వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి లేకుండా   చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఆసుపత్రి సిబ్బంది, డాక్టర్లు సమన్వయంతో రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌, జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు అన్నారు.

ఆసుప త్రిలో వివిధ విభాగాలకు అవసరమైన పరికరాలకు పంపే ప్రతిపాదనలపై ఎప్పటికప్పుడుపై అధికారులతో సంప్రదించాలన్నారు.ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ ఆసుపత్రిలో సమావేశాలు ఉదయం 9 గంటల్లోపు లేదా సాయంత్రం 5 గంటల తరువాత  నిర్వహించుకుంటే బావుంటుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్‌ బోర్డు డైరెక్టర్‌ డాక్టర్‌ దిరిశాల వర ప్రసాద్‌, రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ మామిళ్ళపల్లి జయప్రకాష్‌, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ శంకరరావు, డీఎం హెచ్‌వో డాక్టర్‌ సుబ్రహ్మణ్యేశ్వరి, ఆసుపత్రి సూపరిం టెండెంట్‌ డాక్టర్‌ రవికుమార్‌,నర్సింగ్‌ సూపరింటెం డెంట్‌ వరలక్ష్మీ భాయి,  కమిషనర్‌ చంద్రశేఖర్‌,  నూక పెయ్యి మేరి,గంపల బ్రహ్మావతి పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-08T12:10:00+05:30 IST