బదిలీ సమస్యలపై ఫ్యాప్టో మళ్లీ పోరుబాట యోచన
ABN , First Publish Date - 2020-10-24T11:49:14+05:30 IST
ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి హామీలే తప్ప ఇంతవరకూ అధికారిక ఉత్తర్వుల సవరణ లేకపోవడంతో..

ఏలూరు ఎడ్యుకేషన్, అక్టోబరు 23 : ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి హామీలే తప్ప ఇంతవరకూ అధికారిక ఉత్తర్వుల సవరణ లేకపోవడంతో ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) మరోమారు ఉద్యమ బాట పట్టాలని యోచిస్తోంది. బదిలీలపై ఫ్యాప్టో ప్రతినిధులతో విద్యాశాఖ కమిషనర్ జరిపిన చర్చల్లో పలు అంశాలపై సాను కూలంగా స్పందించినా ఇప్పటికే ఒకసారి ఇచ్చిన బదిలీ కౌన్సెలింగ్ ఉత్తర్వులను వెనక్కు తీసుకునేలా ఉన్నతాధికారుల చర్యలు లేకపోవడంతో ఆ మేరకు మళ్లీ ఉద్యమబాట పట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. సోమవారం మరోదఫా ఫ్యాప్టో సంఘాల ప్రతినిధులు సమావేశమై విద్యాశాఖ మొండివైఖరిని నిరసిస్తూ డీఈవో కార్యాలయ ముట్టడికి పిలుపునివ్వాలని యోచిస్తున్నాయి. కాగా ఈనెల29 నుంచి సాధారణ బదిలీలకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది.