బంద్‌ను విజయవంతం చేయాలి
ABN , First Publish Date - 2020-12-08T04:18:16+05:30 IST
అఖిల భారత రెతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ పిలుపు మేరకు మంగళవారం బంద్‌ను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం కోరారు.

భీమవరం అర్బన్, డిసెంబరు 7: అఖిల భారత రెతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ పిలుపు మేరకు మంగళవారం బంద్‌ను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం కోరారు. ఈ మేరకు సోమవా రం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మోదీ ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ 2020 రైతాంగానికి, వ్యవసాయానికి, దేశానికి అత్యంత నష్టదాయకమన్నారు. ఆ చట్టాలను రద్దుచేయాలని బలరాం డిమాండ్ చేశారు. వ్యవసాయానికి రైతుల నుంచి మార్కెట్ వరకు బడా కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నమన్నారు. నిత్యావసర సరుకుల నిల్వలపై నియంత్రణలు ఎత్తివేసి కార్పొరేట్లకు మేలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నా రన్నారు. మోదీ ప్రభుత్వం రైతు ఉద్యమాన్ని అణచివేలయాలని చూడటం దారుణమన్నారు. గడ్డకట్టే చలిలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న రైతులకు అందరూ అండగా నిలవాలని కోరారు. వైసీపీ, తెలుగుదేశం, జనసేన, ఇతర రాజకీయ పార్టీలు బంద్‌ను బలపర్చాలని కోరారు. చాంబర్ ఆఫ్ కామర్స్, సంస్థలు, సంఘాలు, బ్యాంకులు, ఉద్యోగులు అందరూ బంద్‌కు సహకరించి రైతుకు మద్దతుగా నిలబడాలని కోరారు.