చిన్నాయిగూడెంలో రైతు దారుణ హత్య

ABN , First Publish Date - 2020-08-12T10:59:09+05:30 IST

దేవరపల్లి మండలం చిన్నాయిగూడెం గ్రామానికి చెందిన రైతు గెడా భాస్కరరావు(55) దారుణ హత్యకు గురయ్యాడు. వివరాలివి.. ..

చిన్నాయిగూడెంలో రైతు దారుణ హత్య

ఆస్తి తగాదాలే కారణమని అనుమానం


దేవరపల్లి, ఆగస్టు 11 : దేవరపల్లి మండలం చిన్నాయిగూడెం గ్రామానికి చెందిన రైతు గెడా భాస్కరరావు(55) దారుణ హత్యకు గురయ్యాడు. వివరాలివి.. భాస్కరరావు కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో ఈనెల 10న అతని సోదరుడు గడా సత్యనారాయణ ఫిర్యాదు మేరకు దేవరపల్లి పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. భాస్కరరావు పొలంలో జామచెట్టు ఆకులు కాలిన అనవాలు కనిపించడంతో ఈ సమాచారాన్ని కౌలు రైతు బిరుదుగడ్డ శ్రీను పోలీసులకు తెలియజేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని మంగళవారం పరిశీలించారు. అక్కడ కాల్చి, పూడ్చిపెట్టిన భాస్కరరావు మృతదేహాన్ని వెలికితీశారు. దీనిపై దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. భాస్కరరావుకు 30 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. పిల్లలు లేకపోవడంతో తోడల్లుడు కుమార్తెను పెంచి పెళ్లి చేసి పది ఎక రాలు కట్నంగా అందజేశారు. తోడల్లుడు కుమారుడికి మరో 9 ఎకరాల ఆస్తిని రాశారు.


రెండేళ్ల క్రితం భార్య చనిపోవడంతో ఆస్తి తీసుకున్న కుటుంబ సభ్యులు తనని చూడడం లేదని భాస్కరరావు కోర్టు, పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిరిగినట్టు సమాచారం. ఇటీవల రెండవ వివాహానికి భాస్కరరావు ప్రయత్నిస్తు న్నాడని తెలిసి కుటుంబ సభ్యులే ఈ ఆఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కొవ్వూరు ట్రైనీ డీఎస్పీ శృతి, కొవ్వూరు రూరల్‌ సీఐ సురేశ్‌, దేవరపల్లి ఎస్‌ఐ కే.స్వామిలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆస్తి తమకు దక్కకుండా పోతుందని కుటుంబ సభ్యులే కాల్చి చంపి, పూడ్చిపెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. అనుమానితులను పోలీసులు అదుపు లోకి తీసుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు.

Updated Date - 2020-08-12T10:59:09+05:30 IST