నకిలీ ఎస్‌ఐ అరెస్టు

ABN , First Publish Date - 2020-03-15T11:43:42+05:30 IST

ఎస్‌ఐనంటూ వాహనాలు తనిఖీ చేస్తూ.. సొమ్ములు వసూలు చేస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

నకిలీ ఎస్‌ఐ అరెస్టు

తణుకు, మార్చి 14 :  ఎస్‌ఐనంటూ వాహనాలు తనిఖీ చేస్తూ.. సొమ్ములు వసూలు చేస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.  తణుకు పట్టణంలోని సజ్జాపురానికి చెందిన  మందపల్లి అరవింద కుమార్‌ ఎస్‌ఐ వేషఽధారణలో దుస్తులు ధరించి కొమరవరం రోడ్డులో   వాహనాలను తనిఖీ చేస్తూ వాహనదారుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నాడు. ఈ మేరకు వాహనదారులు నకిలీ ఎస్‌ఐగా గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.


ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనదారుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న అరవింద కుమార్‌ను అరెస్టు చేశారు.అతని వద్ద నుండి రూ.400, యూనిఫాం స్వాధీనం చేసుకున్నారు. నకిలీ ఎస్‌ఐను కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ విధించారు.  ఈ మేరకు పట్టణ ఎస్‌ఐలు కె.రామారావు, రవికుమార్‌, ఏఎస్‌ఐ శ్రీధర్‌, పోలయ్య కాపు, కానిస్టేబుళ్లను డీఎస్పీ రాజేశ్వరరావు, సీఐ డిఎస్‌ చైతన్యకృష్ణ అభినందించారు. 

Updated Date - 2020-03-15T11:43:42+05:30 IST