చేనేత హస్తకళల ఎగ్జిబిషన్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2020-11-28T05:27:37+05:30 IST

చేనేత వస్తువులను వినియోగించుకుని కార్మికులకు మరింత ఉపాధి కల్పించాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ కోరారు.

చేనేత హస్తకళల ఎగ్జిబిషన్‌ ప్రారంభం

భీమవరంటౌన్‌, నవంబరు 27:చేనేత వస్తువులను వినియోగించుకుని కార్మికులకు మరింత ఉపాధి కల్పించాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ కోరారు. త్యాగరాజ భవనం లో చేనేత హస్తకళల హ్యాండ్‌లూమ్‌ అండ్‌ హ్యాండీ క్రాప్ట్సు ఎగ్జిబిషన్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. నిర్వాహకుడు ఎ.సింహాద్రి మాట్లాడుతూ వచ్చే నెల 5వ తేదీ వరకు ఎగ్జిబిషన్‌ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో కొల్లి ప్రసాద్‌, నల్లం రాంబాబు, ఎస్‌. చిన్ని తదితరులు పాల్గొన్నారు. 


Read more