ఎంసెట్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన
ABN , First Publish Date - 2020-10-24T11:46:22+05:30 IST
ఎంసెట్-2020 కౌన్సెలింగ్‌లో అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన శుక్రవారం ప్రారంభమైంది. తణుకు ఎస్ఎంవీఎం పాలిటెక్నిక్ ..

భీమవరం ఎడ్యుకేషన్/ఏలూరు ఎడ్యుకేషన్, అక్టోబరు 23: ఎంసెట్-2020 కౌన్సెలింగ్‌లో అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన శుక్రవారం ప్రారంభమైంది. తణుకు ఎస్ఎంవీఎం పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ సెంటర్లో 170 మంది విద్యార్థుల సర్టిఫికెట్ పరిశీలించినట్టు సెంటర్ కోఆర్డినేటర్ వై.రాజే ంద్రబాబు తెలిపారు. శనివారం 20,001 ర్యాంకు నుంచి 50 వేల ర్యాంకు వరకు వెరిఫికేషన్ చేస్తారు. ఏలూరు సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల కౌన్సెలింగ్ సెం టర్లో 60 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేసినట్టు కళాశాల ప్రిన్సిపాల్ జి.సాంబశివరావు తెలిపారు.