ఫీజు గండం..!

ABN , First Publish Date - 2020-02-08T11:31:00+05:30 IST

జిల్లాలో ఇంటర్‌, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల కాకపోవడంతో యాజమాన్యాలు ఆర్థిక సంక్షోభంలో

ఫీజు గండం..!

సిటీ న్యూస్:  జిల్లాలో ఇంటర్‌, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల కాకపోవడంతో యాజమాన్యాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. 2018-19, 2019-20 సంవత్సరాలకు సుమారు రూ.500 కోట్లు బకాయిలు పేరుకుపోయినట్లు అంచనా. జిల్లాలో 97 ప్రైవేటు జూనియర్‌, నన్నయ వర్సిటీ  నన్నయ వర్సిటీ పరిధిలో 130 డిగ్రీ, పీజీ కళాశాలలు, 19 ఇంజనీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. జూనియర్‌ కళాశాలల్లో 65 వేల మంది విద్యను అభ్యసిస్తున్నారు. ఇందులో 30 శాతం వరకు విద్యా ర్థులకు ఇటీవల అమ్మఒడిలో రూ.15 వేలు చొప్పున జమచేశారు. మిగిలిన వారిలో వేలాది మందికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల కాలేదు. గత ప్రభుత్వ హయాంలో 2018-19 విద్యా సంవత్సరానికి సగం ఫీజు 2018 ఆగస్టులో రీయింబర్స్‌ చేసింది. సార్వత్రిక ఎన్నికలు రావడంతో రెండో విడత నిలిచిపోయింది. దీనిపై యాజమాన్యాలు గత డిసెంబరులో విద్యా ర్థులతో కలిసి ఆందోళన చేసినా ఫలితం లేక పోయింది. జిల్లా ఇంటర్‌ విద్యాశాఖ అధికారి ప్రభా కరరావు హెచ్చరిక జారీచేశారు. అమ్మఒడి సొమ్మును కాలేజీ ఫీజుగా వసూలు చేయకూడదని, హాల్‌ టికెట్లు ఆపితే చర్యలు తీసుకుంటామని ప్రకటిం చడంతో యాజమాన్యాలు తలలు పట్టుకున్నాయి.

డిగ్రీ కళాశాలల పరిస్థితీ ఇంతే 

డిగ్రీ కళాశాలల్లో ఫీజులు వేలల్లో ఉన్నాయి. 2018లో వారికి కొంత జమయ్యాయి. మిగిలిన సొమ్ముకోసం ఈ విద్యా సంవత్సరం ఫిబ్రవరి వచ్చినా ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిపాదనలు రాక పోవడం యాజమాన్యాలు ఆందోళనలో ఉన్నాయి. పెద్ద విద్యా సంస్థలకు రూ.2 కోట్ల వరకు బకాయిలు ఉండగా, మధ్య, చిన్న తరహా విద్యాసంస్థలకు రూ.50 లక్షల నుంచి కోటి వరకు ఉన్నాయి. దీని ప్రకారం రూ.150 కోట్ల వరకు డిగ్రీ విద్యా సంస్థలకు బకా యిలు చెల్లించాలి. డిసెంబరులో మంజూరు చేస్తా మని విద్యాశాఖ చెప్పినా స్పందన లేదు. జిల్లా వ్యాప్తంగా నన్నయ్య యూనివర్సిటీ పరిధిలో 130 డిగ్రీ, పీజీ కాలేజీలు ఉన్నాయి. ఇందులో 60 వేల మంది విద్యార్థులు ఉన్నారు. మూడేళ్ల డిగ్రీ, రెండేళ్ల పీజీ విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్‌ వస్తుం దని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడన్ని బ్యాచ్‌లకు ఇవి అందకపోవడంతో తల్లిదండ్రులపై భారం పెరిగింది. మరోవైపు రీయింబర్స్‌మెంట్‌ పక్కన వుంచి ముందు కొంతైనా ఫీజు చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తున్నాయి. డిగ్రీ, పీజీ విద్యార్థులకు అర్హత కలిగిన వారికి రూ.20 వేలు ఫీజు రీయింబర్స్‌ చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో అది ఎప్పుడు వస్తుందోనని తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. 

ఇంజనీరింగ్‌ విద్యా సంస్థలైతే.. 

ఇంజనీరింగ్‌ విద్యాసంస్థల పరిస్థితి మరీ దారుణం. బకాయిలు విడుదల కాక విద్యాసంస్థల నిర్వహణకు బ్యాంకులు రుణాలు తెచ్చి వేతనాలు ఇస్తున్నామని.. ఇది కోట్లకు చేరిందని వాపోతున్నారు. జిల్లాలో 19 ఇంజనీరింగ్‌ కళాశాలల్లో 40 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 10 వేల మందిపైగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులు. వీటిలో పెద్ద కళాశా లలకు గత ఏడాది రూ.15 నుంచి రూ.25 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. గత ప్రభుత్వం హయాంలో ఫీజుల క్రమబద్దీకరణకు వేసిన కమిటీ సిఫార్సుల కోసం నిర్ణయించిన ఫీజు ప్రకారం రీయింబర్స్‌మెంట్‌ కేటాయిస్తామని ప్రకటించింది. 2018లో సగం ఫీజు లను చెల్లించారు. మిగిలినవి పెండింగ్‌లో పడ్డాయి. 2019 సంవత్సరానికి ఫీజుల నిర్ణయ కమిటీ సిఫార్సులు చేసిన తరువాత కొత్త ప్రభుత్వం అధికా రంలోకి వచ్చింది. ఈ నివేదికను పక్కన పెట్టి.. కొత్త కమిటీని నియమించింది.

ఇది గతేడాది ఇంజ నీరింగ్‌ కళాశాలలను తనిఖీ చేసింది. పెండింగ్‌ ఫీజుల మాట పక్కన పెట్టి ఈ విద్యాసంస్థలకు ఫైర్‌ నియ మావళి, రోడ్లు, నిర్మాణాలు, పర్యావరణం వంటి అనేక అంశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా యని తేల్చింది. ఇలాంటి వాటికి ఫీజు రీయింబర్స్‌ చేసేది లేదని హెచ్చరిస్తూ నోటీసులు ఇచ్చింది. దీంతో విద్యాసంస్థలు ఉక్కిరి బిక్కిరయ్యాయి. 2018-19 బకాయిలే జిల్లా ఇంజనీరింగ్‌లకు రూ.200 కోట్లుపైనే ఉంటుందని అంచనా. ఈ విద్యా సంవత్సరానికి అన్ని కలుపుకుని మరో రూ.300 కోట్లు వరకు ఉంటుందని చెబుతున్నారు. మరో రెండునెలల్లో విద్యా సంవ త్సరం ముగియనున్న సమయానికి విడుదల అవు తాయా ? అన్న సందిగ్ధంలో ఉన్నాయి.

Updated Date - 2020-02-08T11:31:00+05:30 IST