విద్యుత్‌ ఉద్యోగుల నిరసన

ABN , First Publish Date - 2020-11-03T05:45:49+05:30 IST

జేఏసీ నాయకుల పిలుపు మేరకు భోజన విరామ సమయంలో విద్యుత్‌ ఉద్యోగులు నిరసన చేపట్టారు.

విద్యుత్‌ ఉద్యోగుల నిరసన

జంగారెడ్డిగూడెం, నవంబరు 2 : జేఏసీ నాయకుల పిలుపు మేరకు భోజన విరామ సమయంలో విద్యుత్‌ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఏపీ విద్యుత్‌ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ, ఏలూరు సర్కిల్‌ విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ పిలుపులో భాగంగా సోమవారం జంగారెడ్డి గూడెం విద్యుత్‌ డివిజన్‌ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంధన శాఖలతో రోజుల కిందట రాష్ట్ర జేఏసీ చర్చలు సఫలీకృతం కాకపోవడంతో మూడో విడత నిరసన చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం డివిజన్‌ పరిధిలోని ఉద్యో గులు, యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-03T05:45:49+05:30 IST