వణికిస్తున్న చలి

ABN , First Publish Date - 2020-12-28T05:38:18+05:30 IST

ఏలూరు నగరంలో చలి వణికిస్తోంది. రాత్రే కాకుండా పగలు సైతం ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలి మంటలు వేసుకుంటున్నారు.

వణికిస్తున్న చలి
మంచు కమ్మేసిన దృశ్యాలు

 రాత్రి 8 గంటలకే దుకాణాలు బంద్‌

 రహదారి కనిపించక వాహనదారుల ఇబ్బందులు

రానున్న రోజుల్లో మరింత తగ్గనున్న ఉష్ణోగ్రతలు 

ఏలూరు రూరల్‌, డిసెంబరు 27 : ఏలూరు నగరంలో చలి వణికిస్తోంది. రాత్రే కాకుండా పగలు సైతం ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలి మంటలు వేసుకుంటున్నారు. సాయంత్రం కాక ముందే జనం ఇళ్లకు చేరిపో తున్నారు. రాత్రి 8 గంటలకే దుకాణాలు మూతపడుతున్నాయి. మరోవైపు చలి కారణంగా రహదారులపై ప్రయాణం క్షణక్షణం భయంగా మారిందని దగ్గరకు వచ్చే వరకూ వాహనాలు కానరావడం లేదని వాహనచోదకులు గగ్గోలు పెడుతున్నారు. వారం రోజులుగా గ్రామాల్లో చలి గజగజ వణికిస్తుంది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఉదయం 9 గంటలకు కూడా పొగ మంచు పడుతుంది. సాయంత్రం నాలుగు గంటల నుంచి చలి మొదలవుతుంది. ఎముకలు కొరికే చలితో రాత్రంతా ఇళ్ళల్లో జాగారం చేస్తున్నట్లు వాపోతున్నారు. రానున్న రోజుల్లో ఈ  ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాస్త్ర వేత్తలు హెచ్చరిస్తున్నారు. Updated Date - 2020-12-28T05:38:18+05:30 IST