వీడని భయం.. ఏం తినాలన్నా.. ఏం తాగాలన్నా వణుకే

ABN , First Publish Date - 2020-12-10T06:33:54+05:30 IST

ఏలూరు వాసులకు వింత రోగం సృష్టించిన భయం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఏం తాగాలన్నా.. తినాలన్నా ఒకటికి నాలుగుసార్లు ఆలోచిస్తున్నారు.

వీడని భయం.. ఏం తినాలన్నా.. ఏం తాగాలన్నా వణుకే
బాలుడికి పరీక్ష నిర్వహిస్తున్న కేంద్ర వైద్య బృందం నిపుణుడు డాక్టర్‌ జంష్మెట్‌ నాయర్‌

తాగునీరు మిగిల్చిన వింత రోగం 

మారుతున్న నగర వాసుల జీవన శైలి

కాచి చల్లార్చిన నీటినే తాగుతున్న జనం


(ఏలూరు–ఆంధ్రజ్యోతి): ఏలూరు వాసులకు వింత రోగం సృష్టించిన భయం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఏం తాగాలన్నా.. తినాలన్నా ఒకటికి నాలుగుసార్లు ఆలోచిస్తున్నారు. వణికిస్తున్న ఈ వ్యాధిని గుర్తించి, ఎప్పుడు అంతం చేస్తారోనని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఏలూరు మునిసిపాలిటీ నుంచి కార్పొరేషన్‌ స్థాయిగా ఈ మధ్యనే ఎదిగింది. సమీప గ్రామాలు విలీనం అవుతుండటంతో నగర జనాభా నాలుగు లక్షలకు చేరింది. నగరంలోని దక్షిణపు వీధి, పడమర వీధి, కొత్తపేట, అశోక్‌నగర్‌, తంగెళ్లమూడి ప్రాంతాల్లో చాలాకాలం నుంచి నీటి సరఫరా అంతా అస్థవ్యస్థంగా మారింది. దీనికి డ్రైనేజీ వ్యవస్థ తోడైంది. ఇంత వరకు రోడ్లను విస్తరించడానికే పరిమితమైన యంత్రాంగం ప్రజల ప్రాణాలకు కీలకమైన తాగునీటి సరఫ రాను పెద్దగా పట్టించుకోలేదు. సుదీర్ఘ చరిత్ర కలిగిన పంపుల చెరువును మొదటి నుంచి కృష్ణా జలాలతో నింపడం, శుద్ధి చేసిన తరువాత ఆ నీటినే నగరంలో సగభాగం వినియోగిస్తు న్నారు. నగరంలో దాదాపు 27కు పైగా రక్షిత నీటి ట్యాంకులు ఉన్నాయి. వీటికి అదనంగా ప్రతీ ఇంటిలోను ఎవరికి వారు మంచి నీటి బోరు వేసుకుని ఆ నీటినే వినియోగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో పబ్లిక్‌ కుళాయిలకు కొంత వెసులుబాటు ఇవ్వడంతో రక్షిత నీరు నేరుగా అందుతోంది. దక్షిణపు వీధి సహా ఇప్పుడు అంతులేని వింత వ్యాధికి గురైన వారంతా కుళాయి నీరు తాగినవారే. వీరిలో అత్యధికులు సాధారణ, మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారే. ఈ వర్గాల వారికే వ్యాధి ప్రభావం ఎలా పడిందనే దానిపై నిపుణుల బృందాలు ఇంటింటికీ వెళ్లి కారణాలను శోధించాయి.


వారి ఆహారపు అల వాట్లు, జీవనశైలి, తాగునీరు, కూరగాయలు, ధాన్యం, పాడి పశువులు, పాలు, పాల ఉత్పత్తుల వినియోగం వంటి అంశాల న్నింటినీ ఆరా తీశాయి. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆప్‌ న్యూట్రీషన్‌ ప్రతినిధులు ప్రత్యేకించి ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించారు. ప్రాఽథమికంగా వివిధ ప్రయోగ శాలలకు పంపిన నమూనాల్లో పురుగు మందుల అవశేషాలతో సహా భారలోహాలు భారీగా ఉన్నట్టు తేలడంతో దాదాపు నిశ్చేష్టులయ్యారు. ఆక్వాలో వాడే పురుగు మందుల అవశేషాలు, నగర ప్రజలు వాడే తాగు నీటిలో మిళితం కావడం దిగ్ర్భాంతిని కలిగిస్తోంది. పరిస్థితిని అధ్యయనం చేసిన కొందరు ఏలూరు తాగునీటిలో మెఽథాక్లికోర్‌ 0.1 శాతం ఉండాల్సి ఉండగా ఇప్పుడు పరీక్షల్లో మాత్రం 17 శాతం ఉన్నట్టు తేలినట్టు సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. తాగునీటిలో లెడ్‌ అధిక శాతం ఉన్నట్టు తేలడంతో కొందరు పొరుగు ప్రాంతాలకు వెళ్లి తాగు నీరు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే ఈ వింత వ్యాధి భారిన పడిన వారంతా తమ ఆహార, నీటి అలవాట్లను మార్చు కుంటున్నారు. అత్యధికులు నీటిని కాచుకుని ఆ తరువాత తాగేందుకు సిద్ధపడుతున్నారు.


నీటి నమూనాల సేకరణ 

ఏలూరు టూటౌన్‌  : విజయవాడ నుంచి వచ్చిన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మంజుల నేతృత్వంలోని బృందం ఏలూరులోని పంపుల చెరువు, దెందులూరు వద్ద తాగునీటి ట్యాంక్‌ను సందర్శించి శాంపి ల్స్‌ను తీసుకున్నారు. బృందం వాటర్‌ ట్యాంకుల వద్ద వున్న మునిసిపల్‌ అధికారుల నుంచి వివరాలు సేకరించా రు. ఎక్కడెక్కడ నుంచి నీటిని చెరువుల్లో నింపుతారు ? ఈ నీటిని ఎలా శుద్ధి చేస్తారు ? శుద్ధి చేసిన నీటిని క్లోరినేషన్‌ చేసి, ఎటువంటి కెమికల్స్‌ కలుపుతారో అడిగి తెలుసుకుని శాంపిల్స్‌ తీసుకువెళ్ళారు. నివేదికను ప్రభుత్వానికి అందజేస్తా మని తెలిపారు. వాటర్‌ ఎనలిస్టు శివరామకృష్ణ పాల్గొన్నారు. 


పశువుల నమూనాల సేకరణ 

ఏలూరు ఫైర్‌స్టేషన్‌, : ఏలూరువాసులను వణికిస్తున్న  వ్యాధిని కనుగొనేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్‌సీడీసీ) బృందం బుధవారం పశుసంవర్ధకశాఖ జేడీ కార్యాలయంలో వివరాలు సేకరించింది. డాక్టర్‌ సాకేత్‌ ఆధ్వర్యంలోని బృందం పశువుల ద్వారా వచ్చే వ్యాధులపై ఆరాతీసింది. వాటికి ఎటువంటి దా ణా వినియోగిస్తున్నారో తెలుసుకున్నారు. లేబొరేటరీని సంద ర్శించి ఏడీ సుచరితతో మాట్లాడారు. పశువులు, పందులు, కుక్కలు, కోళ్ల నుంచి రక్త నమూనాలు, సీరం నమూనాలను తీసి భోపాల్‌లో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హైసెక్యూరిటీ యానిమల్‌ డిసీజ్‌ లేబొరేటరీకి పంపాలని సూచించారు. 


రంగు మారిన కృష్ణా కాల్వ!

ఏలూరు రూరల్‌, డిసెంబరు 9 : ఏలూరు కృష్ణా కాల్వ నీరు బుధవారం రంగు మారడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రైతులు ఆందోళనకు గురయ్యారు. తొలుత కృష్ణా కాల్వలో తమ్మిలేరు నీరు కలిసి ఉంటుందని భావించారు. తర్వాత ఆ నీరు విజయవాడ నుంచి వదిలిన మురుగునీరుగా ఇరిగేషన్‌ అధికారులు గుర్తించారు. దీంతో పోణంగి పుంత ద్వారా శ్రీపర్రు కాజ్‌వే మీదుగా ఆ నీటిని కొల్లేరులోకి మళ్లిం చారు. నీరు ఒకసారిగా రంగు మారి కాల్వ ప్రవహించ డంతో నగరవాసులు ఆందోళనకు గురయ్యారు. అసలే అంతుపట్టని వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో ఈ ఘటన వారిలో మరింత ఆందోళన రేకెత్తించింది. కార్తీక మాసం స్నానాలు చేసే భక్తులు కాల్వలోకి దిగలేదు.

Updated Date - 2020-12-10T06:33:54+05:30 IST