ఈ-కర్షక్‌లో పంట నమోదు చేసుకోవాలి

ABN , First Publish Date - 2020-04-24T09:54:37+05:30 IST

దాళ్వా పంటలను ఈ-కర్షక్‌లో వివరాలు నమోదు చేసుకోనే అవకాశం ప్రభుత్వం కల్పించిందని ఏవో

ఈ-కర్షక్‌లో పంట నమోదు చేసుకోవాలి

గణపవరం/చాగల్లు, ఏప్రిల్‌ 23 : దాళ్వా పంటలను ఈ-కర్షక్‌లో వివరాలు నమోదు చేసుకోనే అవకాశం ప్రభుత్వం కల్పించిందని ఏవో వైవీఎస్‌ ప్రసాద్‌ తెలిపారు. గణపవరం మండలంలోని పలు సొసైటీల్లో ఈ-కర్షక్‌ నమోదు కార్యక్రమాన్ని గురువారం పరిశీలించారు.గతంలో పంట నమోదు చేయించుకోని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 


ఈ - కర్షక్‌తో సంబంధం లేకుండా  ధాన్యం కొనాలి

ఈ-కర్షక్‌తో సంబంధం లేకుండా ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని చాగల్లులో రైతు సంఘం నాయకులు కళ్లాల వద్ద బస్తాలతో గురువారం ధర్నా  చేశారు. రైతు సంఘం నాయకులు కంకటాల బుద్దుడు, గారపాటి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ కనీస మద్దతు ధర చెల్లించాలన్నారు.చాగల్లులో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 

Updated Date - 2020-04-24T09:54:37+05:30 IST