-
-
Home » Andhra Pradesh » West Godavari » Dwarakatirumala Srivaru
-
గోవిందా.. గోవింద
ABN , First Publish Date - 2020-11-22T04:56:30+05:30 IST
శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శనివారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. దర్శనానికి భక్తులు బారులు తీరారు.

ఆలయంలో భక్తుల రద్దీ
8 నుంచి 10 వేల మంది దర్శనం
ద్వారకాతిరుమల, నవంబరు 21 : శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శనివారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. దర్శనానికి భక్తులు బారులు తీరారు. 8 వేల నుంచి 10వేల మంది వరకు భక్తు లు స్వామిని దర్శించుకున్నారు. 6,928 మంది తలనీలాలను మొక్కు బడులుగా సమర్పించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కల్గకుండా ఈవో డి.భ్రమరాంబ పర్యవేక్షించారు.
ఎండలో భక్తులు ఇక్కట్లు..
అరివిటి మండపం ముందు భాగాన్న ఎండలోనే భక్తులు వేచి ఉండాల్సిన పరిస్ధితి నెలకొంది. సూర్యుడి వేడిమి, కింద నాపరాళ్ల వేడిమితో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.