-
-
Home » Andhra Pradesh » West Godavari » dwarakatirumala lo siva kalyanam west godavari dist
-
ద్వారకా తిరుమలలో శివ కల్యాణం
ABN , First Publish Date - 2020-12-31T04:48:51+05:30 IST
శ్రీ వేంకటేశ్వరస్వామి ఉపాలయమైన భ్ర మరాంబ మల్లికార్జున స్వా మి దేవాలయంలో ఆరుద్రా నక్షత్రం పురస్కరించుకుని స్వామి, అమ్మవార్ల కల్యాణం బుధవారం వైభవంగా నిర్వహించారు.

ద్వారకా తిరుమల, డిసెం బరు 30 : శ్రీ వేంకటేశ్వరస్వామి ఉపాలయమైన భ్ర మరాంబ మల్లికార్జున స్వా మి దేవాలయంలో ఆరుద్రా నక్షత్రం పురస్కరించుకుని స్వామి, అమ్మవార్ల కల్యాణం బుధవారం వైభవంగా నిర్వహించారు.స్వామి, అమ్మవార్లను ప్రత్యేక ఆభరణాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం కార్యక్రమాలను అర్చకులు, వేద పండితులు నిర్వహించారు. శుభ ముహూర్తాన స్వామి, అమ్మవార్ల శిరస్సులపై బెల్లం, జీలకర్ర పెట్టి కల్యాణతంతు నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో కల్యాణాన్ని తిలకించారు.