శ్రీవారి ఆలయంలో నెయ్యి గోల్‌మాల్‌

ABN , First Publish Date - 2020-07-08T21:30:43+05:30 IST

శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రసాదాలకు వినియోగించే..

శ్రీవారి ఆలయంలో నెయ్యి గోల్‌మాల్‌

ద్వారకా తిరుమల(పశ్చిమ గోదావరి): శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రసాదాలకు వినియోగించే నెయ్యి స్కామ్‌ జరిగింది. విషయం వెలుగులోకి రావడంతో సంబంధిత బాధ్యులను సస్పెండ్‌ చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదానికి భారీ ఎత్తున నెయ్యిని కొనుగోలు చేస్తారు. ఇలా వచ్చిన నెయ్యిలో రూ.5.28 లక్షల విలువైన 1100 కేజీల నెయ్యి తేడా ఉన్నట్టు రికార్డుల్లో గుర్తించారు. ఆ విభాగంలో పని చేస్తున్న గుమస్తా మద్దాల శ్రీనును బాధ్యుడిగా గుర్తించి రూ.5.28 లక్షలను రికవరీ చేసి సస్పెండ్‌ చేసినట్టు ఆలయ ఈవో ఆర్‌.ప్రభాకరరావు తెలిపారు. దేవాలయంలో ఇటీవల జరిగిన అంతర్గత బదిలీల్లో ఈ విషయం వెలుగుచూసింది. సూపరింటెండెంట్‌ రమణరాజు, ఏఈవో సూర్యనారాయణకు మెమోలు జారీ చేశామని, వారిచ్చే సమాధానాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Updated Date - 2020-07-08T21:30:43+05:30 IST