దుర్గమ్మకు కుంకుమ పూజలు
ABN , First Publish Date - 2020-11-14T04:41:42+05:30 IST
యడ్లబజారులోని దుర్గమ్మ ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకులు పూజలు చేయించారు.
పాలకొల్లు అర్బన్, నవంబరు 13: యడ్లబజారులోని దుర్గమ్మ ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకులు ఎం.వెంకటరమణ భక్తులతో అమ్మ వారికి కుంకుమ పూజలు, వాహన పూజలు చేయించారు. సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. పట్టణంలోని దేశాలమ్మ, మావుళ్లమ్మ, ముఖ దారమ్మ, మావూరమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉల్లంపర్రులో..
పాలకొల్లు రూరల్: ఉల్లంపర్రులో దుర్గమ్మకు శుక్రవారం అర్చకులు బాదం పూడి సాంబమూర్తి నేతృత్వంలో ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారికి వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరణ చేశారు.
బాలా త్రిపుర సుందరి అమ్మవారికి పంచదారతో అలంకారం
భీమవరం టౌన్, నవంబరు 13: మెంటేవారి తోటలో బాలాత్రిపుర సుందరి అమ్మవారికి శుక్రవారం 50 కేజీల పంచదారతో అలంకారం చేశారు. ఆలయ అర్చకుడు కొమ్ము శ్రీనివాస్ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. 50 కేజీల పంచదారతో అలంకారం చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.