ఇంటెలిజెన్స్‌ డీఎస్పీగా కృష్ణారావు బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2020-12-02T04:41:49+05:30 IST

జిల్లా ఇంటెలిజెన్స్‌ డీఎస్పీగా జీవీ కృష్ణారావు మంగళవారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు.

ఇంటెలిజెన్స్‌ డీఎస్పీగా కృష్ణారావు బాధ్యతల స్వీకరణ
ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ జీవీ కృష్ణారావు

ఏలూరు క్రైం, డిసెంబరు 1 : జిల్లా ఇంటెలిజెన్స్‌ డీఎస్పీగా జీవీ కృష్ణారావు మంగళవారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. కృష్ణా జిల్లా వేల్పుచర్లకు చెం దిన జీవీ కృష్ణారావు 1991 ఎస్‌ఐ బ్యాచ్‌కు చెందిన వారు.తూర్పుగోదావరి జిల్లాలోని వైరామవరం, సఖి నేటిపల్లి, అల్లవరం, సీతానగరం, పశ్చిమగోదావరి జిల్లాలో చింతలపూడి, పెరవలి పోలీస్‌ స్టేషన్లలో ఎస్‌ఐగా  ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. 2008 సంవత్సరంలో ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగోన్నతి పొందారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇంటెలిజెన్స్‌ సీఐగా పనిచేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ట్రాఫిక్‌, పాలకొల్లు సర్కిల్‌, రంపచోడవరం సర్కిల్‌, రాజోలు, కాకినాడ డీసీఆర్‌బీ విభాగాల్లో పనిచేశారు. అనంతరం  పశ్చిమగోదావరి జిల్లాలో డీసీఆర్బీ సీఐగా పనిచేస్తూ ఉన్న సమయంలో ఆయనకు డీఎస్పీగా ఉద్యోగోన్నతి లభించింది. ఉద్యోగ ఉన్న సమయంలో ఆయనను ఇంటెలిజెన్స్‌ విభాగానికి ఎంపిక చేశారు. కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు.  


Updated Date - 2020-12-02T04:41:49+05:30 IST