ఏఎస్‌ఆర్‌ నగర్‌లో దాహం.. దాహం..

ABN , First Publish Date - 2020-06-19T10:21:11+05:30 IST

వానాకాలంలోనూ తాగునీటి కష్టాలు తప్పడం లేదు.. బిందెడు నీటి కోసం మైళ్ల దూరం నడిచి వెళుతున్నారు.

ఏఎస్‌ఆర్‌ నగర్‌లో దాహం.. దాహం..

టి.నరసాపురం, జూన్‌ 18 : వానాకాలంలోనూ తాగునీటి కష్టాలు తప్పడం లేదు.. బిందెడు నీటి కోసం మైళ్ల దూరం నడిచి వెళుతున్నారు. టి.నరసాపురం మండలం కృష్ణాపురం మెట్టకు సమీపాన ఏఎస్‌ఆర్‌ నగర్‌లో  కొందరు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. అక్కడ కనీసం నీటి సదుపాయం లేదు. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లి తాగునీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు లేకపోయినా, వ్యవసాయ బోర్లు పని చేయకపోయినా నీళ్లు దొరకవని వాపోతున్నారు. పలు మార్లు ఆందోళనలు, ధర్నాలు చేయగా ప్రభుత్వం రెండు చేతి పంపులు వేసినప్పటికీ ఆ నీరు తాగడానికి యోగ్యంగా లేవని అన్నారు.


ప్రస్తుతం ఆయిల్‌పామ్‌ తోటల్లో డ్రిప్‌ నుంచి వచ్చే నీటిని పట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు.అధికారులు స్పందించి మంచినీటి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ  వీరాస్వామిని వివరణ కోరగా ఏఎస్‌ఆర్‌ నగర్‌లో పేదలు గుడిసెలు వేసుకున్న స్థలం కోర్టు వివాదంలో ఉండడం వల్ల బోర్లు వేయడానికి అనుమతులు లేవని అన్నారు. అయినప్పటికీ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు.

Updated Date - 2020-06-19T10:21:11+05:30 IST