ఈ నీరు తాగేదెలా..?

ABN , First Publish Date - 2020-11-22T04:42:44+05:30 IST

తీర ప్రాంత ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈ నీరు తాగేదెలా..?
లక్ష్మణేశ్వరం మంచినీటి చెరువు

కుళాయి నుంచి మురికినీరు

తీరంలో దాహం దాహం


నరసాపురం రూరల్‌, నవంబరు 21: తీర ప్రాంత ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచినీటి చెరువుల్లో పుష్కలంగా నీరున్నా శుద్ధిచేసే ఫిల్టర్‌బెడ్‌లు శిథిలావస్థకు చేరాయి. దీంతో మురికి నీరే కుళాయిల ద్వారా సరఫరా అవుతోంది. మండలంలోని తూర్పుతాళ్ళు, లక్ష్మణేశ్వరం, రు స్తుంబాదా గ్రామాల్లో మంచినీటి ప్రాజెక్టులు ఉన్నాయి. 20 గ్రామాలకు ఈ చెరువుల ద్వారానే నీటి సరఫరా జరుగుతోంది. రక్షిత నీటి పథకం ఫిల్టర్‌ బెడ్‌లు శిథిలావస్థకు చేరాయి. మరమ్మతులకు నోచుకోకపోవడంతో అరకొ రగా శుద్ధి చేసిన నీరే తాగాల్సి వస్తుంది. దీంతో చాలామంది నరసాపురం పట్టణం నుంచి సైకిళ్లు, మోటార్‌సైకిళ్లపై టిన్నులతో నీటిని తీసుకుని వెళు తున్నారు. మరికొందరు టిన్ను నీటిని కోనుగోలు చేసుకుంటున్నారు. చుట్టూ నీరున్నా తాగేందుకు గుక్కెడు నీరు లేక కొట్టుమిట్టాడుతున్నారు.


మురికి నీరు సరఫరా..

చెరువు నుంచి కుళాయిల ద్వారా సరఫరా చేసే నీరు శుద్ధి కావడం లేదు. మురికినీరే వస్తుంది. ఆ నీటిని తాగలేక టిన్ను నీటిని కొను క్కుంటున్నాం. నరసాపురం నుంచి ఆటో, బైక్‌ల పై తెచ్చుకుని తాగుతున్నారు. ఫిల్టర్‌బెడ్‌లు మ రమ్మతు లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

వాతాడి ఉమా, వేములదీవిRead more