అనుమతి లేకుండా వెళ్లొద్దు

ABN , First Publish Date - 2020-05-09T08:16:34+05:30 IST

వలస కార్మికులు ప్రభుత్వ అను మతి లేకుండా రాష్ట్రం దాటి వెళ్లవద్దని జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు

అనుమతి లేకుండా వెళ్లొద్దు

వలస కార్మికులతో కలెక్టర్‌ ముత్యాలరాజు 


పోలవరం, మే 8 : వలస కార్మికులు ప్రభుత్వ అను మతి లేకుండా రాష్ట్రం దాటి వెళ్లవద్దని జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు హెచ్చరించారు. శుక్రవారం పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో కార్మికులను సరఫరా చేసే కాం ట్రాక్టర్లు, ప్రాజెక్టు ఇంజనీర్లతో జరిగిన సమీక్ష సమావేశం లో కలెక్టర్‌ మాట్లాడారు. ‘పోలవరం ప్రాజెక్టులో పనిచేస్తు న్న 1,364 మంది ఇతర రాష్ట్రాల కార్మికులను క్షేమంగా వారి రాష్ట్రాలకు చేర్చేవిధంగా చర్యలు తీసుకుంటున్నాం.


ఎవరూ అధైర్య పడవద్దు. బిహార్‌ వెళ్లేందుకు రైలును, మిగిలిన రాష్ట్రాల వారికి బస్సులను ఏర్పాటు చేస్తున్నాం. ప్రయాణఖర్చులను ఎవరికి వారే భరించాలి. ఎవరి రాష్ట్రా లకు వారిని పంపేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు రావాల్సి ఉంది’ అని కలెక్టర్‌ చెప్పారు. సమావేశంలో ఎస్పీ నవదీప్‌సింగ్‌, జేసీ కె.వెంకట రమణా రెడ్డి, అడిషనల్‌ ఎస్పీ కె.కరీముల్లా, డీఎస్పీ ఎం.వెంకటేశ్వ రరావు, ఆర్డీవో ప్రసన్నలక్ష్మి, మెగా కంపెనీ జీఎం సతీష్‌, ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-09T08:16:34+05:30 IST