భయపడాల్సిన అవసరం లేదు : ఎంపీ శ్రీధర్‌

ABN , First Publish Date - 2020-12-12T05:11:00+05:30 IST

నగరంలో ప్రబలిన అంతుపట్టని వ్యాధిపై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, కరోనాలా ఒకరి నుంచి మరొకరికి వస్తుందనే అపోహలను నమ్మొద్దని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ అన్నారు.

భయపడాల్సిన అవసరం లేదు : ఎంపీ శ్రీధర్‌
బాధితురాలిని పరామర్శిస్తున్న ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌

ఏలూరు క్రైం, డిసెంబరు 11 : నగరంలో ప్రబలిన అంతుపట్టని వ్యాధిపై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, కరోనాలా ఒకరి నుంచి మరొకరికి వస్తుందనే అపోహలను నమ్మొద్దని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ అన్నారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను శుక్రవారం సాయంత్రం ఆయన పరామర్శించారు. వారు ఏ  ప్రాంతానికి చెందినవారు, వారే తాగే నీరుపై కూడా ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎంపీ విలేకరులతో మాట్లాడు తూ కరోనా నుంచి కోలుకుంటున్నామనే తరుణంలో ఏలూరు నగరంలో అంతుపట్టని వ్యాధి ప్రబలడంతో అందరూ షాక్‌నకు గురయ్యామ న్నారు. ప్రస్తుతం ఏలూరు పేరును ప్రపంచ దేశాలు వింటున్నాయని, ఇక్కడ ప్రబలిన వ్యాధిపై విదేశాల్లో ఉంటున్నవారు ఆరా తీస్తున్నారని, ఎంతో మంది తనకు ఫోన్‌ చేసి అడిగారన్నారు.  ఈ వ్యాధి ఏమిటనేది ఇంతవరకూ అంతుచిక్క నిదిగా ఉందన్నారు. ఏలూరు నియోజకవర్గానికి చెందిన వారే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కావడం, ఇక్కడ అధికారులు కూడా అప్రమత్తం కావడంతో ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించారన్నారు. ఆయన వెంట ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ వైసీపీ అధ్యక్షుడు పుప్పాల వాసుబాబు, ఎంఆర్‌డీ బలరామ్‌ తదితరులు  ఉన్నారు.  

Updated Date - 2020-12-12T05:11:00+05:30 IST