-
-
Home » Andhra Pradesh » West Godavari » Dont be careless on duty
-
విధి నిర్వహణలో అజాగ్రత్త వద్దు
ABN , First Publish Date - 2020-03-25T10:41:06+05:30 IST
విధి నిర్వహ ణలో అజాగ్రత్తగా ఉండవద్దని, అన్ని జాగ్రత్తలు తీసుకుని విధులు నిర్వర్తించాలని జిల్లా ఆస్పత్రి సేవల సమన్వయ

ఏలూరు క్రైం, మార్చి 24 : విధి నిర్వహ ణలో అజాగ్రత్తగా ఉండవద్దని, అన్ని జాగ్రత్తలు తీసుకుని విధులు నిర్వర్తించాలని జిల్లా ఆస్పత్రి సేవల సమన్వయ అధికారి డాక్టర్ కె.శంకర్‌రావు ఆదేశించారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు మంగళవారం మధ్యాహ్నం జిల్లా క్వాలిటీ మేనేజర్ మనోజ్‌కుమార్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీసీహెచ్‌ఎస్ డాక్టర్ శంకర్‌రావు మాట్లాడుతూ జిల్లాలో కరోనా వ్యాధి రాకుండా అన్ని చర్యలు చేపట్టామని, ముఖ్యంగా 24 గంటలూ విధి నిర్వహణలో ఉండే పారిశుధ్య కార్మికులు రోగుల పట్ల అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఐసోలేషన్ వార్డులో పని చేసేవారు పూర్తి సంరక్షణ డ్రస్‌కోడ్ పాటించాలని సూచించారు. విదేశాల నుంచి వస్తున్న వారిపట్ల కూడా అప్రమత్తంగా ఉండాల న్నారు. సిబ్బంది మాస్కులు ధరించే విధులు నిర్వ ర్తించాలని, గ్లౌజ్‌లు, చెప్పులు వాడాలన్నారు. కార్యక్ర మంలో డాక్టర్ తవ్వా రామ్మోహనరావు, జిల్లా క్వాలిటీ మేనేజర్ మనోజ్ పలు సూచనలు తెలి పారు. శానిటేషన్ పీఆర్వో దత్తు, సూపర్‌వైజర్లు వినోద్, రాజు, పాల్గొన్నారు.