సీఎం సహాయ నిధికి విరాళాలు

ABN , First Publish Date - 2020-04-07T11:18:32+05:30 IST

ఉంగుటూరు నియోజకవర్గ ప్రజలు అందించిన 1,04,07,838 రూపాయల చెక్కును ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌కు

సీఎం సహాయ నిధికి విరాళాలు

నిడమర్రు / తాడేపల్లిగూడెం రూరల్‌ / భీమవరం టౌన్‌ / తణుకు / బుట్టాయగూడెం / ఇరగవరం / నల్లజర్ల / ఉండి / నరసాపురం, ఏప్రిల్‌ 6 :  ఉంగుటూరు నియోజకవర్గ ప్రజలు అందించిన 1,04,07,838 రూపాయల చెక్కును ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌కు సోమవారం అందజేశారు.


వాసవి ఇంజనీరింగ్‌ అధ్యక్ష, కార్యదర్శులు గ్రంధి సత్యనారాయణ, చల్లంచర్ల సుబ్బారావు కళాశాల తరపున సీఎం సహాయ నిధికి రూ.4 లక్షలు, పీఎం సహాయ నిధికి రూ.2లక్షలు, ఎయిర్‌ స్ట్రీప్‌ వాకర్స్‌ తరపున రూ.50వేలు, క్లాత్‌ మర్చంట్స్‌ అసొషియేషన్‌ తరపున రూ.2లక్షలు, ఆరుగొలనుకు చెందిన నూకల బుల్లియ్య, సొదరులు ధనికృష్ణ, బాలకృష్ణ రూ.1లక్ష, అలంపురానికి చెందిన దండుబోయిన శ్రావణి రూ.25వేల చెక్కును ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణకు సోమవారం అందించారు.


భీమవరం పట్టణానికి చెందిన పలువురు సీఎం సహాయ నిధికి చెక్కులను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌కు అందించారు. మంతెన వెంకట నరసింహరాజు రూ.2లక్షల116, ఉద్దరాజు దుశ్యంత్‌వర్మ రూ.2.5లక్షలు, ఇందు కూరి సుబ్రమణ్యం రూ.10వేలు ఇచ్చారు.


ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల తరపున రూ. లక్ష విరాళాన్ని ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుకు ఎమ్మెస్సార్‌ ఆంజనేయులు చెక్కు అందజేశారు. ప్రగతి జూనియర్‌ కళాశాల రూ.30వేలు, సాయి జూనియర్‌ కళాశాల రూ.20వేలు, మారుతీ జూనియర్‌ కళాశాల రూ.20వేలు, ఎంసీ ఎస్‌ జూనియర్‌ కళాశాల రూ.20వేలు, అన్నపూర్ణ జూనియర్‌ కళాశాల రూ.10వేలు అందించారు. ఏలూరు బోర్డు ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఆర్‌ఐవో బి.ప్రభాకరరావుకు రూ.40వేలు అందించినట్టు ఆంజనేయులు తెలిపారు.


పోలవరం నియోజకవర్గంలోని 20 సొసైటీల అధ్యక్షులు ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు సోమవారం రూ.5.13లక్షల చెక్కులను అందజేశారు.


తూర్పువిప్పర్రు పీఏసీఎస్‌ చైర్మన్‌ సైపురెడ్డి పెద్దిరాజు సోమవారం రూ.1లక్ష చెక్కును ఎమ్మెల్యే కారుమూరికి అందజేశారు.


నల్లజర్లలో బీజేపీ మండలాధ్యక్షుడు శెట్టిపల్లి శివనాగరాజు పీఎం సహాయ నిధికి పేటీఎం ద్వారా రూ54,704 విరాళం అందించారు.


వాండ్రం గ్రామానికి చెందిన పెన్మెత్స వెంకట ఆంజనేయరాజు రూ.1లక్ష చెక్కును పీవీఎల్‌ నరసింహరాజుకు అందించారు.


నరసాపురం జైన్‌ సంఘం రూ.5 లక్షలు పీఎం సహాయ నిధి, రూ.5 లక్షలు సీఎం నిధికి మొత్తం రూ.10 లక్షల చెక్‌ను ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుకు అందించారు. ఇటు మహావీరు జయంతిని పురస్కరించుకుని విధులు నిర్వహిస్తున్న వివిధ శాఖల సిబ్బందికి సంఘం తరపున భోజనాలు పంపిణి చేశారు. జైన్‌ సంఘం నాయకులు రాజేంద్ర కుమార్‌జైన్‌, మనోజ్‌ జైన్‌, వినోద్‌కుమార్‌జైన్‌, కిరణ్‌, కిషోర్‌, శైలెష్‌, విమల్‌, రవింధ్రకుమార్‌, జత్‌మల్‌ బ్రదర్స్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-07T11:18:32+05:30 IST