డీఎన్నార్‌ ఇంజనీరింగ్‌ సెమినార్‌ బ్రోచర్‌ ఆవిష్కరణ

ABN , First Publish Date - 2020-11-28T05:11:19+05:30 IST

డీఎన్నార్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఎంబీఏ డిపార్ట్‌మెంట్‌లో ఎఫ్‌డీపీ ప్రోగ్రామ్‌ ఆన్‌ రీసెర్చ్‌ మెథడాలజీ టూల్స్‌ అం డ్‌ టెక్నాలజీ సెమినార్‌ బ్రోచర్‌ ఆవిష్కరణ శుక్రవారం నిర్వహించారు.

డీఎన్నార్‌ ఇంజనీరింగ్‌ సెమినార్‌ బ్రోచర్‌ ఆవిష్కరణ

భీమవరం ఎడ్యుకేషన్‌, నవంబరు 27 : డీఎన్నార్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఎంబీఏ డిపార్ట్‌మెంట్‌లో ఎఫ్‌డీపీ  ప్రోగ్రామ్‌ ఆన్‌ రీసెర్చ్‌ మెథడాలజీ టూల్స్‌ అం డ్‌ టెక్నాలజీ సెమినార్‌ బ్రోచర్‌ ఆవిష్కరణ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యక్ష కార్యదర్శులు గోకరాజు నరసింహరాజు, గాదిరాజు సత్యనారాయణరాజు మాట్లాడుతూ డిసెంబరు 1 నుంచి 7వ తేదీ వరకు సెమినార్‌ జరుగుతుందన్నారు. అధ్యాపకులు పరిశోధనా అంశాలపై అనేక మెలకువలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. అనుభవజ్ఞులైన ఫ్రొఫెసర్స్‌, రిసోర్స్‌ పర్సన్స్‌గా వ్యవహరిస్తారన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జీవీ రాజు, ఎంబీఏ డైరెక్టర్‌ డి.వెంకటపతిరాజు పాల్గొన్నారు. 

Read more