పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలి

ABN , First Publish Date - 2020-11-22T04:24:31+05:30 IST

పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని, పోటీ పరీక్షలకు ఎంతో ఉపయోగమని డీఎన్నార్‌ కళాశాల అధ్యక్ష కార్యదర్శులు గోకరాజు నరసింహరాజు, గాదిరాజు సత్యనారాయణ రాజు అన్నారు.

పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలి
డీఎన్‌ఆర్‌ కళాశాలలో అల్లూరి నరసింహరాజుకు సన్మానం

భీమవరం ఎడ్యుకేషన్‌, నవంబరు 21: పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని, పోటీ పరీక్షలకు ఎంతో ఉపయోగమని డీఎన్నార్‌ కళాశాల అధ్యక్ష కార్యదర్శులు గోకరాజు నరసింహరాజు, గాదిరాజు సత్యనారాయణ రాజు అన్నారు. డీఎన్నార్‌ కళాశాలలో గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో శనివారం ఆయన మాట్లాడారు. కళాశాల పరిపాలన అధికారి పి.రామకృష్ణంరాజు మాట్లాడుతూ మంచి పుస్తకాలను చదవడం వలన మంచి ఉద్యోగం, మంచి భవిష్యత్‌ ఉంటుందన్నారు. వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో అల్లూరి నరసింహరాజును ఘనంగా సన్మానించారు. కార్యక్ర మానికి కృష్ణమోహన్‌, చిట్టిబాబు, రత్నశేఖర్‌, పీజీ లైబ్రరీ విభాగాధిపతి, సిబ్బంది పాల్గొన్నారు.

Read more