నరసాపురంలో ఫస్ట్‌ ఎయిడ్‌ క్లినిక్‌ సీజ్‌

ABN , First Publish Date - 2020-11-22T05:02:27+05:30 IST

నరసా పురంలో జిల్లా వైద్యాధికారాణి డాక్టర్‌ సునంద శనివారం ఆకస్మిక తనిఖీలు చేశారు.

నరసాపురంలో ఫస్ట్‌ ఎయిడ్‌ క్లినిక్‌ సీజ్‌
నరసాపురంలో క్లినిక్‌ తనిఖీ చేస్తున్న డీఎంహెచ్‌వో డాక్టర్‌ సునంద

డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీ

వైద్యుడిపై క్రిమినల్‌    కేసుకు ఆదేశం

నరసాపురం, నవంబరు 21: నరసా పురంలో జిల్లా వైద్యాధికారాణి డాక్టర్‌ సునంద శనివారం ఆకస్మిక తనిఖీలు చేశారు. బ్రాహ్మణ సమాక్య భవనం సమీపంలో గాబ్రియిల్‌ ఫస్ట్‌ ఎయిడ్‌ క్లినిక్‌లో చేస్తున్న వైద్యాన్ని చూసి నివ్వర బోయారు. బెడ్‌లపై రోగులకు సిలైన్‌ ఎక్కించడం చూసి ఆశ్చర్యపోయారు. ఆస్పత్రుల్లో యాంటీ బయోటిక్‌ మందులు గుర్తించారు. క్లినిక్‌ నిర్వాహకుడు సతీష్‌ పీఎంపీ సర్టిఫికేట్లు, విద్యార్హతలపై ఆరా తీశారు. పదో తరగతి చదువుకున్నట్లు చెప్పడంతో  షాక్‌కు గురయ్యారు. వెంటనే క్లినిక్‌ను సీజ్‌ చేసి క్రిమినల్‌ కేసులు పెట్టాలని ఆదేశించారు. ఆనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో చాలా మంది పీఎంపీ, ఆర్‌ఎంపీలు నిబంధనలు అత్రికమించి వైద్యం చేస్తున్నట్లు ఫిర్యాదు లందుతున్నాయన్నారు. కొందరు కరోనా వ్యాధికి కూడా వైద్యం చేస్తున్నట్టు తెలి సిందన్నారు.ఇటువంటి వారిపై నిఘా ఉంచామన్నారు. మరోవైపు జిల్లా వైద్యాధికారి దాడులు విషయం తెలుసుకున్న కొందరు పీఎంపీ, ఆర్‌ఎంపీలు తమ ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్లను మూసివేశారు. 

Read more