-
-
Home » Andhra Pradesh » West Godavari » district judge
-
మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
ABN , First Publish Date - 2020-11-22T05:09:42+05:30 IST
మహిళలకు చట్టాలపై అవగాహన ఉంటే అభివృద్ధికి దోహద పడుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా జడ్జి ఇ.భీమారావు అన్నారు.

జిల్లా జడ్జి ఇ.భీమారావు
ఏలూరు క్రైం, నవంబరు 21: మహిళలకు చట్టాలపై అవగాహన ఉంటే అభివృద్ధికి దోహద పడుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా జడ్జి ఇ.భీమారావు అన్నారు. జిల్లా న్యాయ సేవా సదన్ భవనంలో శని వారం ఏర్పాటు చేసిన మహిళా చట్టాలపై అవగాహన, శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిఽథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు మహిళా చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. మీరు తెలుసుకున్న చట్టాన్ని మీ తోటివారికి కూడా తెలియజెప్పినప్పుడే మీరు నేర్చుకున్నదానికి ఒక సార్థకత ఉంటుందన్నారు. ప్రతి మహిళా ధైర్యంగా ఉంటూ నిబంధనలకు లోబడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచి తంగా న్యాయపరమైన సహాయాన్ని పొందవచ్చన్నారు. మహిళా చట్టాలపై నిపుణులు, న్యాయవాదులు పీవీ విజయలక్ష్మి, కేఎస్ నాగలక్ష్మి శిక్షణలో పాల్గొన్న మహిళలకు అవగాహన కల్పించడంతో పాటు వారి సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి డి.బాలకృష్ణయ్య, మహిళలు పాల్గొన్నారు.