-
-
Home » Andhra Pradesh » West Godavari » DIG visit to tallapudi police station
-
కేసులు పెండింగ్‌లో ఉంచవద్దు
ABN , First Publish Date - 2020-12-15T06:18:28+05:30 IST
పోలీస్ స్టేషన్‌లో కేసులు పెండింగ్‌లో లేకుండా సత్వరమే పరిష్కరించడానికి కృషి చేయాలని తాళ్లపూడి ఎస్‌ఐ సతీశ్‌ను డీఐజీ కేవీ మోహనరావు ఆదేశించారు.

డీఐజీ కేవీ మోహనరావు
తాళ్లపూడి, డిసెంబరు 14: పోలీస్ స్టేషన్‌లో కేసులు పెండింగ్‌లో లేకుండా సత్వరమే పరిష్కరించడానికి కృషి చేయాలని తాళ్లపూడి ఎస్‌ఐ సతీశ్‌ను డీఐజీ కేవీ మోహనరావు ఆదేశించారు. సోమవారం తాళ్లపూడి పోలీస్ స్టేషన్‌కు విచ్చేసిన ఆయన రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాటుసారా తయారీని అరికట్టడానికి ఎస్‌ఈబీ అధికారులతో దాడులు ముమ్మరం చేయాలన్నారు. ఫిర్యాదుదారులతో గౌరవంగా వ్యవహరించాలన్నారు. ఆయన వెంట కొవ్వూరు రూరల్ సీఐ సురేశ్, ఎస్‌ఐ సతీశ్ ఉన్నారు.