హెడ్‌ కానిస్టేబుళ్ల పదోన్నతులకు చర్యలు : డీఐజీ

ABN , First Publish Date - 2020-12-02T05:03:49+05:30 IST

ఏలూరు రేంజ్‌ పరిధిలో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐలకు సీనియార్టీని బట్టి పదోన్నతులు కల్పించడానికి రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్‌ ఉత్తర్వుల మేరకు అన్ని చర్యలు తీసుకున్నామని ఏలూరు రేంజ్‌ డీఐజీ కెవీ మోహనరావు అన్నారు.

హెడ్‌ కానిస్టేబుళ్ల పదోన్నతులకు చర్యలు : డీఐజీ
సమావేశంలో మాట్లాడుతున్న డీఐజీ కెవీ మోహనరావు

ఏలూరు క్రైం, డిసెంబరు 1:  ఏలూరు రేంజ్‌ పరిధిలో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐలకు సీనియార్టీని బట్టి పదోన్నతులు కల్పించడానికి రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్‌ ఉత్తర్వుల మేరకు అన్ని చర్యలు తీసుకున్నామని ఏలూరు రేంజ్‌ డీఐజీ కెవీ మోహనరావు అన్నారు. ఏలూరు రేంజ్‌లో ఉన్న ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లా, విజయవాడ సిటీల నుంచి మొత్తం 76 మంది హెచ్‌సీ, ఏఎస్‌ఐలు పెదవేగిలో ఉన్న డీటీసీనకు అర్హత పరీక్ష కోసం హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఐజీ కెవీ మోహనరావు మాట్లాడుతూ అభ్యర్థులకు రాత పరీక్ష, నేర దర్యాప్తు, మౌఖిక, డ్రిల్‌ వంటివి నిర్వహిస్తామని వీటిలో అర్హత సాధించిన వారికి అనంతపురం పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజీలో శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. జిల్లా ఎస్పీ కెనారాయణ నాయక్‌, కాకినాడ ఎపీఎస్‌పీ కమాండెంట్‌ ఎస్‌.నాగరాజు, ఎఆర్‌ అదనపు ఎస్పీ ఎం.మహేష్‌కుమార్‌, పెదవేగి డీటీసీ ప్రిన్సిపాల్‌ కింజారపు ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-02T05:03:49+05:30 IST