భూమిని ఖాళీ చేయాలంటూ బెదిరిస్తున్నారు

ABN , First Publish Date - 2020-11-28T05:04:48+05:30 IST

భూమిని ఖాళీ చేయాలంటూ మండల రెవె న్యూ శాఖ అధికారులు బెదిరింపులకు గురి చేస్తున్నారని టి.నరసాపురం మండలం కృష్ణాపురానికి చెందిన గిరిజనులు, దళితులు శుక్రవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు.

భూమిని ఖాళీ చేయాలంటూ బెదిరిస్తున్నారు
కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న కృష్ణాపురం గ్రామస్థులు

కలెక్టరేట్‌ వద్ద కృష్ణాపురం గిరిజనులు, దళితుల ధర్నా

ఏలూరు కలెక్టరేట్‌, నవంబరు 27: భూమిని ఖాళీ చేయాలంటూ మండల రెవె న్యూ శాఖ అధికారులు బెదిరింపులకు గురి చేస్తున్నారని టి.నరసాపురం మండలం కృష్ణాపురానికి చెందిన గిరిజనులు, దళితులు శుక్రవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్య దర్శులు పిల్లి రామకృష్ణ, ఎ.రవి మాట్లాడుతూ  గ్రామంలో రెవె న్యూ సర్వే నెంబరు 86లో 89.63 ఎకరాల భూమిలో పదేళ్ల నుంచి గిరిజనులు, దళితులు, పేదలు కొంతభూమిలో ఇళ్లు వేసుకుని నివాసం ఉంటూ మిగిలిని భూమిని సాగు చేస్తు న్నారన్నారు. కొంతకాలంగా వారిని మండల రెవెన్యూ శాఖ అధికారులు ఖాళీ చే యాలని బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. వీరికి ఇళ్లు, సాగు పట్టాలు ఇవ్వా లని మండల, జిల్లా అధికారుల చుట్టూ తిరిగినా నేటికీ పట్టాలు ఇవ్వలేదని ఆవే దన వ్యక్తం చేశారు. ఇప్పటికే పేదలపై అక్రమంగా భూస్వాముల చేత కేసులు పెట్టించి పోలీసుల చేత భయబ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. కార్య క్రమంలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తుమ్మల సత్యనారాయణ, మండల నాయకులు ఎ.మురళి, మడకం సుధారాణి, మడకం కుమారి, బాబూరావు, పేద కుటుం బాలు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-28T05:04:48+05:30 IST