విద్యార్థుల హాజరు పెంచండి : డీఈవో
ABN , First Publish Date - 2020-12-12T04:26:13+05:30 IST
పాఠశాలకు 8 నుంచి 10వ తరగతి వరకు విద్యార్ధులు విధిగా హాజరయ్యేలా ఉపాధ్యాయుల తల్లిదండ్రులను ప్రోత్సహించాలని డీఈవో రేణుక సూచించారు.
ఏలూరు రూరల్, డిసెంబరు 11 : పాఠశాలకు 8 నుంచి 10వ తరగతి వరకు విద్యార్ధులు విధిగా హాజరయ్యేలా ఉపాధ్యాయుల తల్లిదండ్రులను ప్రోత్సహించాలని డీఈవో రేణుక సూచించారు. డీఈవో కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఉమ్మడి పరీక్షలు నిర్వహణ సంస్థ సభ్యుల సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ తయారు చేయాలని తీర్మానించారు. ఏపీటీడబ్ల్యుఎస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రాజేశ్వరశర్మ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో అప్పలరాజుగూడెంకు చెందిన టి.నరసింహస్వామిని బోర్డు సభ్యు డిగా నియమించారు. సంస్ధ కార్యదర్శి విమురళీ కృష్ణ, ఆర్‌వి రమణ, డీ ఉదయ్ కుమార్, జె సురేష్‌బాబు, ఉప విద్యాశాఖ అధికారులు వివిఎస్‌ఎస్ వరదాచార్యులు, జె సూర్యనారాయణ, ఉమ్మడి పరీక్ష నిర్వహణ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.