రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి

ABN , First Publish Date - 2020-12-31T04:45:48+05:30 IST

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, ఢిల్లీ రైతుల ఉద్యమానికి మద్దతుగా చింతలపూడిలో కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, రైతు సంఘాల ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు.

రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి
బుట్టాయగూడెం బస్టాండ్‌ వద్ద రైతు సంఘాల ఆందోళన

ఢిల్లీలో రైతుల ఉద్యమానికి మద్దతుగా నిరసన ప్రదర్శనలు

చింతలపూడి, డిసెంబరు 30 : రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, ఢిల్లీ రైతుల ఉద్యమానికి మద్దతుగా చింతలపూడిలో కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, రైతు సంఘాల ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. కాంగ్రెస్‌ పార్టీ నేత థామస్‌ మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన చట్టాల వల్ల రైతులకు ఉపయోగం లేదన్నారు. దీక్షల్లో కాంగ్రెస్‌ నాయకులు కృష్ణమూర్తి, రైతు సంఘ నాయకులు కాలేషా, రంగనాఽథ్‌, సీపీఎం నాయకులు ఆర్‌వీ సత్యనారాయణ, సూర్య కుమార్‌, సీపీఐ నాయకులు మస్తాన్‌,  దొంతా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

బుట్టాయగూడెంలో..

బుట్టాయగూడెం : అన్నదాతలకు గుదిబండగా మారనున్న మూడు రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఏఐకేఎంఎస్‌, ఏపీ రైతు సంఘం, గిరిజన సంఘం, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కారం రాఘవ, కోర్స జలపాలు, తెల్లం రామకృష్ణ మద్దిపాటి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. బస్టాండ్‌ సెంటరు లో రైతు సంఘాలు చేపట్టిన మూడు రోజుల దీక్షలు బుధవారంతో ముగిశాయి.

Updated Date - 2020-12-31T04:45:48+05:30 IST