మద్యానికి బానిసై..

ABN , First Publish Date - 2020-12-12T04:30:40+05:30 IST

మద్యానికి బానిసైన ఒక వ్యక్తి డ్రెయిన్‌లో పడి అను మానాస్పదస్థితిలో మృతిచెందాడు.

మద్యానికి బానిసై..

డ్రెయిన్‌లో పడి యువకుడి అనుమానాస్పద మృతి

తాడేపల్లిగూడెం క్రైం, డిసెంబర్‌ 11 : మద్యానికి బానిసైన ఒక వ్యక్తి డ్రెయిన్‌లో పడి  అను మానాస్పదస్థితిలో మృతిచెందాడు. సాలిపేటకు చెందిన గొర్తి కామేశ్వరరావు  పెద్ద కుమారుడు నాగబాబు (36) వడ్రంగి పనిచేసుకుంటూ మద్యానికి బానిసై ఇంటికి దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో భాగ్యలక్ష్మిపేటలోని మునిసిపల్‌ డ్రెయినేజీలో శుక్రవారం మృతదేహమై కనిపించాడు. మృతుడు నాలుగేళ్లగా భార్యకు దూరంగా ఉంటున్నాడు. తండ్రి కామేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ గుర్రయ్య తెలిపారు.


Updated Date - 2020-12-12T04:30:40+05:30 IST