-
-
Home » Andhra Pradesh » West Godavari » death
-
చికిత్సపొందుతూ వృద్ధుడి మృతి
ABN , First Publish Date - 2020-11-28T04:53:10+05:30 IST
రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురై విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న వృద్ధుడు మృతి చెందారు.

ఏలూరు క్రైం, నవంబరు 27 : రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురై విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న వృద్ధుడు మృతి చెందారు. ఏలూరు భావిశెట్టివారిపేటకు చెందిన బొండా సత్యనారాయణ (64) ఈ నెల 18వ తేదీ ఉదయం చొదిమెళ్ళలో ఉన్న తన భార్యను మోటారు సైకిల్ పై తీసుకుని వస్తుండగా కండ్రికగూడెం పెట్రోలు బంకు వద్ద ఏలూరు సత్రంపాడుకు చెందిన పాల వ్యాపారి కట్టుబోతు పూర్ణచంద్రరావు (38) తన మోటారు సైకిల్‌తో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సత్యనారాయణ తలకు తీవ్ర గాయాలు కాగా తొలుత ఆంధ్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ రెండు రోజుల చికిత్స అనంతరం విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రికి తీసుకువెళ్ళగా అక్కడ చికిత్సపొందుతూ మృతిచెందారు. ఈ సంఘటనపై ఎమ్మెల్సీగా నమోదు చేసి ఏలూరు రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రూరల్ ఎస్‌ఐ చావా సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సత్యనారాయణ మృత దేహానికి శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.