-
-
Home » Andhra Pradesh » West Godavari » danger raod
-
కానరాని ప్రమాదం
ABN , First Publish Date - 2020-11-01T05:23:29+05:30 IST
ప్రమాదాల నియంత్ర ణకు వేసిన జీబ్రా లైన్లు అనుకోని ప్రమాదాలను తెచ్చి పెడుతు న్నాయి. అయినా కనీసం అటు వైపు కన్నెత్తి చూసే వారే కరువయ్యారు. ప్రమాదాన్ని జరిగిన ప్రాం తాన్ని గుర్తించిన అధికారులు అక్కడ ప్రమాదం ఎందుకు జరిగిం దనే కోణంలో చూడకుండా ప్రమాదంగానే వదిలేస్తు న్నారు. దీంతో నిత్యం వాహన దారులు ప్రమా దాల బారిన పడుతున్నారు. ఆసు పత్రుల పాలవుతూనే ఉన్నారు.దీనికి నిదర్శనమే తేతలి వద్ద జీబ్రా లైన్లు.. ఆ జీబ్రా లైన్ల వద్ద రోడ్డంతా సాఫీగానే కనిపి స్తుంది.. బాగానే ఉంది కదా అని వేగంగా వెళ్లామా వెనుక కూర్చున్న వారు పడిపోవడం ఖాయం. ఎందుకంటే ఆ జీబ్రా లైన్లు మధ్య గోతులు పడడంతో వాహన దారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల ఒక బైక్‌పై దంపతులు వేగంగా వెళుతున్నారు. వెనక కూర్చున్న భార్య భర్తను పట్టుకో కుండా కూర్చుంది..అయితే ఒక్కసారిగా బైక్ జీబ్రా లైన్ల గోతిలో పడడంతో ఆమె వెనుకకు పడి తలకు

– తేతలి వద్ద పొంచి ఉన్న ప్రమాదం
– జీబ్రా లైన్ల మధ్య గోతులు
– పడిపోతున్న వాహనదారులు
తణుకురూరల్, అక్టోబరు 31 :ప్రమాదాల నియంత్ర ణకు వేసిన జీబ్రా లైన్లు అనుకోని ప్రమాదాలను తెచ్చి పెడుతు న్నాయి. అయినా కనీసం అటు వైపు కన్నెత్తి చూసే వారే కరువయ్యారు. ప్రమాదాన్ని జరిగిన ప్రాం తాన్ని గుర్తించిన అధికారులు అక్కడ ప్రమాదం ఎందుకు జరిగిం దనే కోణంలో చూడకుండా ప్రమాదంగానే వదిలేస్తు న్నారు. దీంతో నిత్యం వాహన దారులు ప్రమా దాల బారిన పడుతున్నారు. ఆసు పత్రుల పాలవుతూనే ఉన్నారు.దీనికి నిదర్శనమే తేతలి వద్ద జీబ్రా లైన్లు.. ఆ జీబ్రా లైన్ల వద్ద రోడ్డంతా సాఫీగానే కనిపి స్తుంది.. బాగానే ఉంది కదా అని వేగంగా వెళ్లామా వెనుక కూర్చున్న వారు పడిపోవడం ఖాయం. ఎందుకంటే ఆ జీబ్రా లైన్లు మధ్య గోతులు పడడంతో వాహన దారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల ఒక బైక్‌పై దంపతులు వేగంగా వెళుతున్నారు. వెనక కూర్చున్న భార్య భర్తను పట్టుకో కుండా కూర్చుంది..అయితే ఒక్కసారిగా బైక్ జీబ్రా లైన్ల గోతిలో పడడంతో ఆమె వెనుకకు పడి తలకు తీవ్ర గాయ మైంది..ఇలా నిత్యం ప్రమాదాలు చోటు చేసు కుంటు న్నాయి. అధికారులు స్పందించి భద్రత ఏర్పాట్లు చేయాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.