అలరించారు.. పోటీపడ్డారు..

ABN , First Publish Date - 2020-12-14T04:22:23+05:30 IST

కళాకారులు అలరించారు.. తమదైన శైలిలో నువ్వా నేనా అంటూ పోటీ పడ్డారు. కొవ్వూరు సంస్కృత కళాశాలలో ఆదివారం సంస్కార భారతి, అఖిల భారత కూచిపూడి నాట్యకళా మండలి సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కూచిపూడి నృత్య పోటీలు నిర్వహించారు.

అలరించారు.. పోటీపడ్డారు..
రాష్ట్రస్థాయి కూచిపూడి నృత్య పోటీలో తలపడిన కళాకారులు

కొవ్వూరులో రాష్ట్రస్థాయి కూచిపూడి నృత్యపోటీలు

కొవ్వూరు, డిసెంబర్‌ 13 : కళాకారులు అలరించారు.. తమదైన శైలిలో నువ్వా నేనా అంటూ పోటీ పడ్డారు. కొవ్వూరు సంస్కృత కళాశాలలో ఆదివారం సంస్కార భారతి, అఖిల భారత కూచిపూడి నాట్యకళా మండలి సంయుక్త ఆధ్వర్యంలో  రాష్ట్రస్థాయి కూచిపూడి నృత్య పోటీలు నిర్వహించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 25 మంది కళాకారులు హాజరై పోటీపడ్డారు.అనంతరం నిర్వహించిన ముగింపు సభలో సంస్కార భారతి అధ్యక్షుడు టీఎన్‌వీ రమణమూర్తి మాట్లాడారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు భవిష్యత్‌ తరాలకు అందించేందుకు సంస్కార భారతి కృషిచేస్తుందన్నారు. గత నెలలో ఆన్‌లైన్‌ వేదికగా నిర్వహించిన పోటీల్లో జిల్లాస్థాయిలో ప్రతిభ కనబర్చినవారిని ఫైనల్‌ పోటీలకు ఎంపిక చేశామన్నారు.కొవ్వూరులో మూడు వేదికలపై పోటీలు నిర్వహించినట్టు చెప్పారు.ఈ కార్యక్రమంలో అఖిల భారత కూచిపూడి నాట్య కళా మండలి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పసుమర్తి కేశవ ప్రసాద్‌, సంస్కార భారతి దక్షిణ మధ్యక్షేత్ర ప్రముఖ్‌ వేదనభట్ల శేఖర్‌, ఉస్తాద్‌ బిస్మిల్లాఖాన్‌ అవార్డ్‌ గ్రహీత డాక్టర్‌ చింతా రవి బాలకృష్ణ, సంస్కార భారతి ప్రధాన కార్యదర్శి దుర్భా శ్రీనివాస్‌,యేపుగంటి శ్రీనివాస్‌, మురళీకృష్ణ  పాల్గొన్నారు.

Updated Date - 2020-12-14T04:22:23+05:30 IST