కరెంటు బిల్లులను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2020-05-10T09:03:24+05:30 IST

లాక్‌డౌన్‌ వల్ల పేద ప్రజలు పనులు లేక వారి ఆదాయాలు కోల్పోయారని ఇటువంటి సమయంలో ..

కరెంటు బిల్లులను రద్దు చేయాలి

ఏలూరు కార్పొరేషన్‌, మే 9 : లాక్‌డౌన్‌ వల్ల  పేద ప్రజలు పనులు లేక వారి ఆదాయాలు కోల్పోయారని ఇటువంటి సమయంలో ఒకేసారి రెండు నెలల కరెంటు బిల్లులు చెల్లించడం కష్టం కాబట్టి పేదల కరెంటు బిల్లులను రద్దు చేయాలని కోరుతూ సీపీఎం ఏలూరు నగర శాఖ ఆధ్వర్యంలో శనివారం విద్యుత్‌ సౌధా వద్ద సీపీఎం నాయకులు మోకాళ్లపై నిలుచుకుని నిరసన తెలిపారు. సీపీఎం నాయకుడు పళ్ళెం కిషోర్‌ మాట్లాడుతూ  ప్రభుత్వం పునరాలోచించి పేద కుటుంబాల విద్యుత్‌ బిల్లులు రద్దు చేయాలని కోరారు.  సీపీఎం నాయకులు పి.ఆదిశేషు, వి.సాయిబాబా, జగన్నాఽథం, అప్పాయమ్మ, రమాంజనేయులు, సత్యనారాయణ, కోటేశ్వరరావు, దుర్గ పాల్గొన్నారు.

Updated Date - 2020-05-10T09:03:24+05:30 IST