మద్యం తరలిస్తున్న ఇద్దరిపై కేసు

ABN , First Publish Date - 2020-12-31T04:49:58+05:30 IST

అక్రమంగా మద్యం తరలించే ఇద్దరిపై కేసు నమోదు చేశామని జీలుగుమిల్లి ఎస్‌ఐ కె.విశ్వనాథబాబు బుధవారం తెలిపారు.

మద్యం తరలిస్తున్న ఇద్దరిపై కేసు

జీలుగుమిల్లి, డిసెంబరు 30 : అక్రమంగా మద్యం తరలించే ఇద్దరిపై కేసు నమోదు చేశామని జీలుగుమిల్లి ఎస్‌ఐ కె.విశ్వనాథబాబు బుధవారం తెలిపారు. తెలంగాణ నుంచి ఆర్‌టీసీ బస్సులో ఆంధ్రాకు మద్యం తరలిస్తుం డగా ఎం.కిరణ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి రూ.34,220 విలువ చేసే 48 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి పి.లక్ష్మీసందీప్‌ నుంచి రూ.4,200 విలువ చేసే 3 మద్యం బాటిళ్లను సీజ్‌ చేసి ఇద్దరిపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2020-12-31T04:49:58+05:30 IST