-
-
Home » Andhra Pradesh » West Godavari » crime
-
ఆగివున్న లారీని ఢీకొట్టిన పెళ్లి వ్యాన్
ABN , First Publish Date - 2020-12-10T06:28:58+05:30 IST
ఆచంట నుంచి నారాయణపురం పెళ్లి నిమిత్తం వెళ్తున్న మినీ వ్యాన్ కుంచనపల్లి జాతీయ రహదారిపై ఆగివున్న లారీని ఢీకొట్టడంతో వ్యాన్‌లో ఉన్న 17 మందికి గాయాలయ్యాయి.

17 మందికి గాయాలు
తాడేపల్లిగూడెం రూరల్, డిసెంబర్ 9 : ఆచంట నుంచి నారాయణపురం పెళ్లి నిమిత్తం వెళ్తున్న మినీ వ్యాన్ కుంచనపల్లి జాతీయ రహదారిపై ఆగివున్న లారీని ఢీకొట్టడంతో వ్యాన్‌లో ఉన్న 17 మందికి గాయాలయ్యాయి. వెంటనే వారిని ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆచంట మార్కెట్ ప్రాంతానికి చెందిన బి.పల్లమ్మ, సీహెచ్ వెంకటలక్ష్మి, జి.సత్యవతి, పి.కమల, పి.మంగమ్మ, ఎం.మేరి, బి.అక్కాయమ్మ, బి.భాగ్యవతి, పి. రత్నకుమారి, ఎం.విజయలక్ష్మి, కె.పల్లపరాజు, బి.అమరావతి, బి.పాపమ్మ, బి.చంద్రకళ, టి.సుజాత, కె.రాణి, డి.అనూషలకు ప్రాథమిక చికిత్స అందించా రు. ఈ మేరకు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రఘు తెలిపారు.