లారీ ఢీకొని కూరగాయల వ్యాపారి మృతి

ABN , First Publish Date - 2020-12-06T05:33:17+05:30 IST

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన సంఘటన శనివారం పెంటపాడు శివారులో జరిగింది.

లారీ ఢీకొని కూరగాయల వ్యాపారి మృతి

పెంటపాడు, డిసెంబరు, 5 : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన సంఘటన శనివారం పెంటపాడు శివారులో జరిగింది. ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. గణపవరానికి చెందిన పత్తి ధరణేష్‌(34) కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. ప్రతీ రోజు తాడేపల్లిగూడెం నంచి గణపవరం కూరగాయలు తీసుకెళ్లి తోపుడు బండిపై అమ్ముతుంటాడు. ఈ నేపథ్యంలోనే గణపవరం నుంచి తాడేపల్లిగూడెం మోటారు సైకిల్‌పై వస్తుండగా పెంటపాడు–కె.పెంటపాడు రహదారి మధ్య టిప్పర్‌ లారీ వెనుక నుంచి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య దేవి, కుమార్తె చాందిని, కుమారుడు రాజు ఉన్నారు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2020-12-06T05:33:17+05:30 IST